బీసీ బాలుర వసతిగృహాన్ని సందర్శించిన జిల్లా జడ్జి
విజయనగరం లీగల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి మహారాణి పేటలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని, ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడం గమనించారు ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని హితవు పలికారు. అన్ని రూమ్‌లను పరిశీలించి పిల్లలకు అందుతున్న మెనూ గురించి వివరాలు తెలుసుకున్నారు విద్యార్థులతో మాట్లాడి వారికి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? లేదా? అని తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రాజేష్ కుమార్, కూర్మానంద రావు, తహసీల్దార్ పి.సత్యవతి ఎంఈఓ, జిల్లా బీసీ సంక్షేమాధికారి పెంటోజీరావు, టూ టౌన్ ఎస్సై కృష్ణమూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment