సారాతో నలుగురి అరెస్టు
మెంటాడ: సారా తరలిస్తుండగా పట్టుబడిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి సారా బాటిల్స్ మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నట్లు ఆండ్ర ఎస్సై కె.సీతారాం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆండ్ర రిజార్వాయర్ వెనుక గల లోతుగెడ్డ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు 20 బ్యాటిల్స్‌లో 40 లీటర్ల సారాను తరలిస్తుండగా పట్టుకుని వారిని స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. పట్టుకున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
పెండింగ్ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేయండి
● ట్రాన్స్‌కో ఎస్‌ఈ చలపతిరావు
● సాక్షి కథనానికి స్పందన
వీరఘట్టం: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా రైతులను మోసగిస్తోందని మంగళవారం సాక్షిలో ప్రచురితమైన ‘ఉచిత విద్యుత్ పధకానికి మంగళం’ అనే కధనంపై జిల్లా ట్రాన్స్‌కో ఈఓ చలపతిరావు స్పందించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉచిత విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో రైతుల వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏయే మండలాల్లో ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయో పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ట్రాన్స్‌కో ఏఈలను ఆదేశించారు.
గూడ్స్ సైడింగ్ ప్రారంభం
దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి రైల్వేస్టేషన్ వద్ద గందర గోళం మధ్య గూడ్స్‌సైడింగ్ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. రైల్వే మూడో లైన్ పనులతో పాటు గూడ్స్ సైడింగ్ పనులు అప్పట్లో ప్రారంభమై పూర్తి కావడంతో బొబ్బిలి గూడ్స్‌షెడ్ స్థానంలో కోమటిపల్లి పల్లి వద్ద మంగళవారం ప్రారంభం కావడంతో ఇంతవరకు బొబ్బిలిలో పని చేసిన కార్మికులతో పాటు వి,కృష్ణాపురం, వింధ్యవాసి, వంగర, పెదమానాపురం, పాచలవలస మరడాం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు నాలుగు వందల మంది కార్మికులు రావడంతో మధ్యాహ్నం వరకు పనులు ప్రారంభం కాలేదు. రైల్వేస్టేషన్ నుంచి కోమటిపల్లి ఆటోస్టాండ్ వరకు బియ్యం లారీలు ఉండడం గమనించిన పెదమానాపురం ఎస్సై కాంట్రాక్టర్‌తో మాట్లాడగా ఆయన కార్మికులతో తొలి రోజు 50 లారీలలో వచ్చిన బియ్యాన్ని రైలులో వేయించారు.
చెరకు లారీ బోల్తా
రాజాం సిటీ: మండల పరిధి రాజయ్యపేట జంక్షన్ వద్ద మంగళవారం చెరుకు లారీ బోల్తా పడింది. పరిమితికి మించి లోడుతో తెర్లాం నుంచి రేగిడి మండలం సంకిలి సుగర్ ఫ్యాక్టరీకి వెళ్తున్న లారీ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం రద్దీగా ఉన్న జంక్షన్ వద్ద లారీ బోల్తా పడడంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అధికలోడుతో వెళ్తున్న వాహనాలపై పోలీసులు దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహన రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.
రహదారి భద్రతపై ర్యాలీ
విజయనగరం క్రైమ్: రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నగరంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ జరిగింది. కోట వద్ద ఈ ర్యాలీని ఎస్పీ వకుల్ జిందల్ జెండా ఊపి ప్రారంభించారు. కోటవద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ సింహాచలం మేడ, బాలాజీ జంక్షన్, ట్యాంక్ బండ్, హోటల్ మయూర, ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొనసాగింది.అనంతరం ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ రహదారి భద్రత ప్రమాణాలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదని చెప్పారు. లైసెన్స్ తప్పని సరిగా ఉండాలన్నారు. రోటరీ క్లబ్ నిర్వాహకుడు డా.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రాణాలు కాపాడుకోవాలంటే మనకు మనమే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ సూరిబాబు, ఎస్సైలు నూకరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.
సారాతో నలుగురి అరెస్టు
సారాతో నలుగురి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment