శంబర పాఠశాలను సందర్శించిన ‘కేసలి’
మక్కువ: మండలంలోని శంబర జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు, జిల్లా విద్యాశాఖాధికారి తిరుపతినాయుడుతో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించారు. అలాగే పాఠశాల ఆవరణ, పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడం వల్ల అనధికార వ్యక్తులు చొరబడి మద్యం తాగడం, తాగిన మద్యం బాటిల్స్ పాఠశాల ఆవరణలో వదిలేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే పశువులు సంచరించడం వల్ల కూడా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని, పునరావృతం కాకుండా తక్షణమే తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి తిరుపతినాయుడికి సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పాచిపెంట సీడీపీఓ బొత్స అనంతలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ, ఉపాధ్యాయ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment