సీతానగరం: మండలంలోని నిడగల్లుగ్రామానికి చెందిన వ్యక్తి సుమారు రూ 2.5 కోట్లతో నాలుగు రోజుల క్రితం గ్రామం నుంచి పరారైనట్లు సమాచారం. బాధితులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన వ్యక్తి మెడికల్ షాపు నిర్వహిస్తూ చుట్టుపక్కల గ్రామాలు పాపమ్మవలస, నీలకంఠాపురం ప్రజలతో నమ్మకంగా ఉండేవాడు, ప్రజల్లో కలిగిన నమ్మకం అనంతరం చీటీలు, వడ్డీవ్యాపారం, ప్రోనోట్లు రాయడం ఆర్థికపరమైన పనులు నిర్వహించాడు. మందుల షాపునకు వచ్చిన వారిలో కొంతమంది చిన్నపాటి లావాదేవీలు నిర్వహించడం వల్ల చిట్టీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా ప్రోంసరీ నోట్లు రాసి పంపించేవాడు. అలా డబ్బులున్న వ్యక్తులు అతనిపై ఉన్న ఉమ్మకంతో 90 మందికి పైగా వ్యక్తులు రూ.2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఇచ్చినట్లు తెలిసింది. గ్రామానికి చెందిన ఒకవ్యక్తి కుటుంబ అవసరాల నిమిత్తం అప్పు తీర్చాలని కోరాడు. అయితే అడిగిన వెంటనే అప్పుతీర్చక పోవడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అదేవ్యక్తి గ్రామ పెద్దల ఎదుట పంచాయితీ పెట్టడంతో ఒకటి–ఒకటిగా అప్పులు ఇచ్చిన వారు బయటకు వచ్చి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలో పాల్గొన్నారు. మెడికల్‌షాపు నిర్వాహకుడిని పెద్దలు పిలిచి అప్పుల విషయమై అడగడంతో కొంతఅప్పు తీర్చుతాను. మిగతా మిగిలిన అప్పు స్థిరాస్తులు విక్రయించి అందరికీ న్యాయం చేయాలని చెప్పినట్లు బాధితులు తెలిపారు. అప్పులు ఇచ్చిన వారిలో ఆందోళన మొదలవడంతో నిర్వాహకుడు సడన్‌గా నాలుగు రోజుల క్రితం పరారయ్యాడు. ఈ విషయమై ఎస్సై ఎం.రాజేష్ వద్ద మంగళవారం ప్రస్తావించగా నిడగల్లులో ప్రజలనుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని వ్యక్తి పరారైనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లి తగుచర్యలు తీసుకుంటామన్నారు.
ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
Comments
Please login to add a commentAdd a comment