ప్రాణం మీదికి తెచ్చిన పది రూపాయలు
శృంగవరపుకోట: పది రూపాయలు తెచ్చిన తంటా ప్రాణాల మీదికొచ్చింది. చెల్లని పది రూపాయలు ఇచ్చావంటూ పెట్రోల్‌బంక్ ఉద్యోగి చేయి చేసుకోవడంతో వినియోగదారుడు కాలు విరిగి ఆస్పత్రి పాలయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోటకు చెందిన నౌదాసరి ఈశ్వరరావు మంగళవారం పనినిమిత్తం తన బైక్‌మీద ధర్మవరం వైపు వెళ్తూ మండలంలోని సీతంపేట గ్రామం వద్ద ఉన్న పెట్రోల్‌బంక్‌కు వెళ్లాడు. బంక్‌లో ఆయిల్ వేయించుకున్న ఈశ్వరరావు సొమ్ము చెల్లించాడు. ఈశ్వరరావు ఇచ్చిన నోట్లలో ఒక పదిరూపాయల నోటు చెల్లదని బంక్ ఉద్యోగి వాదనకు దిగాడు. దీంతో స్వల్ప ఘర్షణ జరిగి బంక్ ఉద్యోగి ఈశ్వరరావును నెట్టేయడంతో పక్కనే ఉన్న రెయిలింగ్‌పై పడిపోయాడు. స్థానికులు హుటాహుటిన చేరుకుని ఈశ్వరరావును ఎస్.కోట ఆస్పత్రికి చేర్చారు. ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు నడుము వద్ద ఇబ్బంది ఉందని, తొడఎముక విరిగిందని చెప్పి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. క్షక్షతగాత్రుని బంధువులు బంక్ ఉద్యోగికి దేహశుద్ధి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్.కోట ఎస్సై చంద్రశేఖర్ చెప్పారు.
పెట్రోల్ బంక్ ఉద్యోగి నిర్వాకం
వినియోగదారుడికి విరిగిన కాలు
Comments
Please login to add a commentAdd a comment