వుషు పోటీలకు వర్సిటీ క్రీడాకారులు
ఎచ్చెర్ల క్యాంపస్: పంజాబ్‌లోని ఛండీఘడ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 22 నుంచి 27 వరకు అఖిల భారత మహిళలు, పురుషుల వుషు పోటీలు జరగనున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం తరఫున ఆర్.పావని (ప్రతిభా డిగ్రీ కళాశాల), ఎం.శిరీష (విద్యాధరి డిగ్రీ కళాశాల) ప్రాతినిధ్యం వహించనున్నారు. కోచ్‌గా కె.మురళీ వ్యవహరిస్తున్నారు. క్రీడాకారులను వీసీ కె.ఆర్.రజిని, అధికారులు మంగళవారం అభినందించారు.
ఇన్ఫోసిస్ స్కాలర్‌షిప్‌కు విద్యార్థి ఎంపిక
టెక్కలి: ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అందజేసే స్కాలర్‌షిప్‌కు టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల మొదటి ఏడాది సీఎస్‌ఈ విద్యార్థిని ఎ.హేమలత ఎంపికై నట్లు డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్టెమ్ స్టార్స్ స్కాలర్‌షిప్‌కు ఎంపికై న విద్యార్థినికి ఏడాదికి లక్ష రూపాయలు చొప్పున నాలుగేళ్ల పాటు రూ. 4 లక్షలు ఉపకార వేతనం కింద అందజేస్తారని వివరించారు. పదో తరగతి, ఇంటర్‌లో సాధించిన మార్కులతో పాటు ఆర్థిక స్థోమత, ప్రతిభ ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, సీఎస్‌ఈ హెచ్‌ఓడీ వై.రమేష్, అసిస్టెంట్ హెచ్‌ఓడీ టి.చలపతిరావు, శాక్ ఇన్‌చార్జి జె.సురేష్‌కుమార్ అభినందించారు.
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన మినీ వ్యాన్
టెక్కలి : కోటబొమ్మాళి మండలం బొడ్డపాడు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జలుమూరు మండలం సురవరం గ్రామానికి చెందిన వండాన శ్రీను టెక్కలి నుంచి కోటబొమ్మాళి వైపు తన ట్రాక్టర్‌తో వస్తుండగా, బరంపురం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న ఓ మినీ వ్యాన్ బలంగా ఢీ కొట్టడంతో ట్రాక్టర్ తొట్టె బోల్తా పడింది. వ్యాన్ ముందు భాగం పూర్తిగా నుజ్జయ్యింది. వ్యాన్ డ్రైవర్ బాదల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
చికిత్స పొందుతూ యువకుడు మృతి
ఆమదాలవలస: మండలంలోని శ్రీహరిపురం గ్రామానికి చెందిన పొన్నాడ సురేష్‌కుమార్(33) ఆమదాలవలస పట్టణానికి చెందిన చిట్టీ వ్యాపారి వేధింపులు తాళలేక ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. రాగోలు జెమ్స్‌లో చికిత్స పొందుతున్న సురేష్‌కుమార్ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంభ సభ్యులు తెలిపారు. కుమారుడి మరణంతో తండ్రి పొన్నాడ దమరకేశ్వరరావు, తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమదాలవలస ఎస్‌ఐ బాలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గ్రూప్–2 పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 23న జరగనున్న గ్రూప్–2 మెయిన్స్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆర్డీవో కె.సాయి ప్రత్యూష తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయం వంటివి సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్టీసీ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ సహా, పలు ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
వుషు పోటీలకు వర్సిటీ క్రీడాకారులు
వుషు పోటీలకు వర్సిటీ క్రీడాకారులు
వుషు పోటీలకు వర్సిటీ క్రీడాకారులు
వుషు పోటీలకు వర్సిటీ క్రీడాకారులు
Comments
Please login to add a commentAdd a comment