ఉద్యోగ భద్రత కల్పించండి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు గొప్పలు ఊదరగొట్టారని, కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతూ ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారని, తమ ఉద్యోగ భద్రత కల్పించాలని పశుసంచార వాహన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలో పశుసంవర్థక శాఖ కార్యాలయం వద్ద తొలగించిన పశుసంచార వాహన ఉద్యోగులు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంచార పశు ఆరోగ్య సేవల వాహనాలు జిల్లాలో 18 ఉన్నాయని వాటిని ఆదివారం నుంచి నిలిపివేసి వాహనాలను పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకుడికి అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయని తెలిపారు.
అదే విధంగా తమకు టెర్మినేషన్ ఆర్డర్స్ కూడా జారీ అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఉన్నఫలంగా ఉద్యోగం నుంచి తీసేస్తే ఎలా బతకాలని ప్రశ్నించారు. వాహనాలు నిలిపివేయడం అనివార్యమైతే తమను పశుసంవర్ధక శాఖలో కొనసాగించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment