ఉద్దానంలో ఎలుగు సంచారం
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలో గల వజ్రపుకొత్తూరు, చినకొత్తూరు, కిడిసింగి పరిసర జీడి తోటల్లో గత రెండు రోజులుగా ఎలుగు సంచరిస్తూ రైతుల కంట పడటంతో వారు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉద్దాన ప్రజల జీవనాధారమైన జీడి పంట పూత దశలో ఉండటంతో రైతులు తోట పనుల్లో బిజీ బిజీగా తోటల్లోనే గడుపుతున్నారు. తోటకు కంచెలు ఏర్పాటు చేయడం, పురుగు మందులు వేయడం, తదితర పనులు చేసేందుకు తోటకు వెళ్తున్నారు. ఈ సమయంలో ఎలుగు దాడి చేస్తుందన్న భయంతో ఆందోళన చెందుతున్నారు.
ఎలుగుబంటిని తప్పించబోయి వ్యక్తి మృతి
కాశీబుగ్గ: మందస మండలం ముకుందపురం గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మందసకు చెందిన జయరాం తన భార్యతో కలిసి స్కూటీపై వస్తుండగా ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి రావడంతో అదుపుతప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జయరాం అక్కడికక్కడే మృతిచెందగా.. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాన్ని హరిపురం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment