
మహిళల భద్రతపై నిబద్ధత
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందని, రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిదా అన్నారు. ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో సుభద్ర యోజన పథకాన్ని అమలు చేస్తామన్న హామీని నెరవేర్చిందన్నారు. కేవలం 8 నెలల్లో సుభద్ర యోజన కింద 1 కోటి మందికి పైగా లబ్ధిదారులకు 10 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. ఈ పథకం కోసం ఐదేళ్లలో సమగ్రంగా రూ. 55,000 కోట్లు వెచ్చిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ ఐశ్వర్య బిస్వాల్ మాట్లాడుతూ మహిళల భద్రత, శ్రేయస్సు కోసం మోహన్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా సభ్యులు అవయవ దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు తెలిపారు. అవయవ దానం ప్రాముఖ్యతను అర్థం చేసుకుని 2,000 మందికి పైగా మరణానంతరం అవయవదానం కోసం తమ పేర్లను నమోదు చేసుకోగా, మరణానంతరం నేత్ర దానం కోసం 1000 మందికి పైగా ప్రమాణం చేశారని ఆమె తెలిపారు. విశిష్ట సేవలందించిన 20 మందిని సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment