
నేరాల నియంత్రణ అందరి బాధ్యత
జయపురం: జయపురంలో నేరాలు పెరగటంపై పట్టణ ప్రముఖులు, పలు సంస్థల ప్రతినిధుల ఫిర్యాదుపై చర్యలు చేపట్టాలని పోలీస్ డీజీని ముఖ్యమంత్రి మోహణ మఝి ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జయపురం పట్టణంలో నేరాలు నివారించేందుకు పట్టణ పోలీసు అధికారి ఈశ్వర చంద్ర తండి నడుం బిగించారు. గతకొద్ది నెలలుగా పట్టణంలో దొంగతనాలు, చైన్ స్నేకర్స్, దోపిడీలు, కిడ్నాప్‌లు, నేరాలు ఎక్కవయ్యాయి. పట్టణాన్ని అపరాధ ముక్త పట్టణంగా మార్చాలని, పట్టణంలో శాంతిని పునరుద్ధరించాలని కొత్తగా పట్టణ పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఈశ్వర చంద్ర తండి శుక్రవారం సాయంత్రం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల, పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జయపురం పట్ణణంలో అకస్మాత్తుగా నేరాలు పెరగటానికి గల కారణాలపై ఆయన సభికులతో చర్చించారు. సరస్వతీ పూజల సందర్భంగా మూర్తి నిమరజన చేసి వస్తున్న విక్రమదేవ్ విశ్వవిద్యాలయ విద్యార్థిపై కత్తితో పొడిచిన సంఘటన, హటపోదర్‌లో ఒక షోరూంలో దొంగతనం, లింగరాజ్‌నగర్‌లో ఒక ఇంటిలో40 తులాల బంగారం, రూ.30 వేల దొంగతనం, ధన్‌పూర్ శాఖ కెనాల్ ప్రాంతంలో దొంగతనం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంతోపాటు పలు ప్రాంతాల్లో అసాంఘిక వ్యక్తులకు అడ్డాలుగా ఉన్న విషయం, పట్టణంలో అపరిచితుల సంఖ్య పెరగటం, తదితర సంఘటనలపై చర్చించారు. బయట వారు ఎక్కడ నుంచి వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్నారో వారి జాబితా తయారు చేయాలని పోలీసు అధికారి కౌన్సిలర్లకు సూచించారు. అనుమానితులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేవారు ఆ విషయం పోలీసులకు తెలపాలన్నారు. మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, వైస్ చైర్‌పర్సన్ బి.సునీత, కౌన్సిలర్లు, ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం, ట్రక్కు మాలిక్ సంఘం ప్రతినిధిలు, సమాజ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌లో
ఒక్కటైన దంపతులు
జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయసేవా ప్రదీకరణ జయపురం వారు అంతర్ జాతీయ మహిళా దినోత్సవంతో పాటు లోక్ అదాలత్‌ను శనివారం నిర్వహించారు. స్థానిక ఇల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ఆదాలత్‌లో వివిధ కోర్టుల్లో ఉన్న సివిల్, క్రిమినల్, మోటారు ప్రమాదాల కేసులు, రెవెన్యూ, భూ వివాదాలు, కుటుంబు సమస్యలు, వివాహ సంబంధిత కేసులను పరిష్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా లోక్ అదాలత్‌లో భార్యా భర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించారు. భర్తకు 60 ఏళ్లు, భార్యకు 50 ఏళ్లు, వారికి ఒక కుమార్తె. ఇరువురు విద్యావంతులు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగులు. అయితే కుటుంబ కలహాలతో ఎనిమిదేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. లోక్ అదాలత్‌లో ఇద్దరితో చర్చించి సమస్యను పరిష్కరించి వారిని ఒకటి చేశారు. దంపతులు ఒకరికొకరు మిఠాయి తినిపించుకున్నారు. కాగా అదాలత్‌లో 6947 పెండింగ్ కేసులలో 6289 పరిష్కరించారు. మూడు కోట్ల 74 లక్షల రూాయలను జరిమానాగా వసూలు చేశారు. కేటగిరీస్ కేసులలో 2865 కేసులు టేకప్ చేసి వాటిలో 415 పరిష్కరించి 15 కోట్ల 10 లక్షల 88 వేల 87 రూపాయలతో కేసులు షటిల్ చేశారు. అదాలత్‌ను జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షులు పీప్ కుమార్ మహంత ప్రారంభించారు. అదనపు జిల్లా జడ్జి సంఘమిత్ర దాస్, మహిళా న్యాయ విభాగ విచారపతి అలకనంద మహంతి, న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి, లోక్‌అదాలత్ శాశ్వత విచారపతి సుమన్ జెన, రిజిస్ట్రార్ బిసు్ట్రపసాద్ దేవత, జయపురం సబ్ డివిజనల్ జడ్జి సంతోష్ కుమార్ దాస్, ప్రథమ శ్రేణి విభాగ విచారణపతి అనిమేస్ జెన పాల్గొన్నారు. కొరాపుట్, కొట్‌పాడ్, లక్ష్మీపూర్, సెమిలిగుడ, దసమంతపూర్, బొరిగుమ్మ, లమతాపుట్ కోర్టులలో కూడా లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసులు పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు.

నేరాల నియంత్రణ అందరి బాధ్యత

నేరాల నియంత్రణ అందరి బాధ్యత
Comments
Please login to add a commentAdd a comment