
ముగిసిన నామినేషన్ల పర్వం
జయపురం: ఈ నెల 27 వ తేదీన జరుగనున్న జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ పర్వం ముగిసింది. మొత్తం 27 నామినేషన్‌లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి దాసరథి పట్నాయక్ శనివారం వెల్లడించారు. జిల్లా బార్ అధ్యక్ష పదవికి ఐదు, ఉపాధ్యక్ష పదవికి 2 నామినేషన్‌లు దాఖలయ్యాయి. కార్యదర్శి పదవికి 3, సహాయ కార్యదర్శి పదివికి ఒకటి, సహాయ కార్యదర్శి (మహిళ)పదవికి ఒకటి, కోశాధిపతి పదవికి 2, గ్రంథాలయ కార్యదర్శి పదవికి 2, గ్రంథాలయ సహాయ కార్యదర్శి(మహిళ) పదవికి ఒకటి, కోశాధ్యక్ష పదవికి 2 నామినేషన్‌లు వచ్చాయి. కార్యవర్గ సభ్యుల పదవులకు 10 నామినేషన్‌లు దాఖలయ్యాయి. ఎన్నికల అధికారికి సహాయ ఎన్నికల అధికారులుగా జ్యోతిరంజన్ పూజారి, ఎస్.ఎస్.సుందరమ్ సహకరించారు. 9వ తేదీన నామినేషన్‌ల పరిశీలన జరుగుతుందని, 12న నామినేషన్‌ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. 12న బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. మార్చి 29వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉదయం 9 నుంచి 3 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారి దాసరథి పట్నాయక్ వెల్లడించారు.
7 నామినేషన్‌లు
జయపురం: జయపురం సబ్ డివిజన్ కొట్‌పాడ్ బార్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్‌ల పర్వం పూర్తయింది. వివిధ పదవుల కోసం 7 నామినేషన్‌లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి, సీనియర్ న్యాయవాది జితేంద్రనాథ్ మహాపాత్రో శనివారం వెల్లడించారు. బార్ అధ్యక్ష పదవికి ప్రముఖ న్యాయవాది మణిప్రసాద్ పట్నాయక్, పంకజ కుమార్ పాత్రో, అజిత్ కుమార్ పట్నాయక్‌లు నామినేషన్‌లు దాఖలు చేశారని వెల్లడించారు. కార్యదర్శి పదవికి యువ న్యాయవాది ముక్తేశ్వర నాయక్(బాబులి), జ్ఞానేంద్ర నాయక్ నామినేషన్‌లు వేశారు. ఉపాధ్యక్ష పదవికి సుధీర్ చంద్రనాయక్ నామినేషన్ వేయగా, సహాయ కార్యదర్శి పదవికి ఎ.చంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 29వ తేదీన ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల అధికారి వెల్లడించారు.

ముగిసిన నామినేషన్ల పర్వం

ముగిసిన నామినేషన్ల పర్వం
Comments
Please login to add a commentAdd a comment