
సందడిగా సుభద్రాయోజన కార్యక్రమం
● తరలివచ్చిన మహిళలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా యంత్రగం ఆధ్వర్యంలో మాల్యవంత్ హాస్టల్ ప్రాంగణంలో శనివారం సుభద్రా యోజన రెండో విడత మంజూరు కార్యక్రమాన్ని నిర్వహించారు. బరంపురంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రారంచగా.. అదే సమయంలో మల్కన్‌గిరిలో స్థానిక ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి ప్రారంభించారు. ఈ పథకం కోసం ఇప్పటికే 1,49,153 మంది మహిళలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో 1,34,610 మందికి ఆర్థికసాయం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా రెండో విడత నిధులు విడుదల చేసినట్టు ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రదన్, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రెండు వేలమందికి పైగా అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సందడిగా సుభద్రాయోజన కార్యక్రమం
Comments
Please login to add a commentAdd a comment