
25 యూనిట్ల రక్తం సేకరణ
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంద్ర గ్రామంలో శనివారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 25 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కుంద్ర కమ్యూనిటీ ఆస్పత్రి, ఒడియా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వైధ్యాధికారి డాక్టర్ గణేష్ ప్రసాద్ దాస్ ప్రారంభించారు. కొరాపుట్ జిల్లా రక్త దాతల మోటివేటెడ్ అసోసియేషన్ సభ్యులు, కొట్‌పాడ్ ఎమ్మెల్యే ప్రతినిధి బద్రి నారాయణ ఆచార్య ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. గౌరవ అతిథిగా సమాజ సేవకుడు పద్మనాభ బిశాయి, భగవాన్ పండ, తుషార్ భట్, ఉపేంద్ర భట్, ధనపతి పొరజ, దయాధాన హరిజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ గణేష్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ.. రక్తదాన శిబిరాల నిర్వహణ తగ్గడంతో అత్యవసర సమయంలో రక్తం లభ్యంకాని పరిస్థితి ఉందన్నారు. బ్లడ్‌బ్యాంకుల్లో నిల్వలు తగ్గుతున్నాయన్నారు. భవిష్యత్తులో సమితిలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సహకారంతో ప్రతి గ్రామ పంచాయతీలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు. అర్హులంతా రక్తదానం చేసి కొరతను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. కుంద్రా సమితిలో విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు జిల్లా రక్తదాతల మోటివేటెడ్ అసోసియేషన్ సహకరిస్తోందని సభ్యుడు భద్రినారాయణ ఆచారి హామీ ఇచ్చారు. జయపురం బ్లడ్‌బ్యాంక్ టెక్నీషియన్లు శుభశ్రీ మిశ్ర, బులు గౌడ, అజయ పండ దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. కుంద్ర ఆస్పత్రి బి.ఎ.ఎం.తాజల్ తరాశియ, ఫార్మాసిస్టు త్రినాథ్ సాహు, విఘ్నేశ్వర పండ, సంగ్రామ కేశరి లెంక, సంబాద్ కుంద్ర బ్లాక్ ప్రతినిధి అక్షయ పట్నాయక్, సదాశివ నాయిక్, గంగాధర నాయిక్, కున హరిజన్ శిబిరాన్ని పర్యవేక్షించారు. రక్త దాతలకు ప్రశంసా పత్రాలను అందజేసి సత్కరించారు.

25 యూనిట్ల రక్తం సేకరణ
Comments
Please login to add a commentAdd a comment