పొగాకు బోర్డు ఈడీ శ్రీధర్‌బాబుకు సత్కారం
కొరిటెపాడు(గుంటూరు): పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఏడున్నర సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వ సేవలు పూర్తి చేసుకుని ఉత్తరఖండ్ రాష్ట్రానికి వెళ్తున్న అద్దంకి శ్రీధర్‌బాబును పొగాకు బోర్డు పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.ఎన్.మిత్ర మాట్లాడుతూ శ్రీధర్‌బాబు పొగాకు పరిశ్రమకు చేసిన సేవలు అసమానమైనవని, రైతులు, వ్యాపారులు, ఉద్యోగుల అభ్యున్నతికి చేసిన కృషి శ్లోఘనీయమని కొనియాడారు. పొగాకు పరిశ్రమ వ్యవస్థకే ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి శ్రీధర్‌బాబు అని, కోవిడ్ సమయంలో ఆయన బోర్డు కార్యకలాపాలు సమర్థంగా నడిపిన తీరు అందరి ప్రశంసలు పొందారన్నారు. సత్కార గ్రహీత శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పొగాకు బోర్డుకి సేవలు చేసే అవకాశం భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అని పేర్కొన్నారు. తన తల్లీదండ్రులు, గురువుల వద్ద నేర్చుకున్న సిద్ధాంతం ‘అన్నదాత సుఖీభవ’ అని రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని అదే నా విజయానికి కారణమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment