నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించండి
టైలరింగ్ చేస్తూ జీవిస్తుంటాను. నా ఇంటి పక్కనే ఉండే పూజల కోటేశ్వరరావు గతంలో నా భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. కోర్టులో అతనికి రెండేళ్ల శిక్ష పడింది. అతనిపై పోలీసు స్టేషన్‌లో రౌడీషీటు కూడా ఉంది. శిక్షాకాలం పూర్తిచేసుకుని వచ్చిన అతను నాపై కత్తితో దాడిచేయటంతో నేను తీవ్రంగా గాయపడి చికిత్స పొంది కోలుకున్నా. కత్తితో దాడి చేసిన కేసు ఉపసంహరించుకోవాలని, లేకుంటే చంపుతానని కోటేశ్వరరావు, బ్రహ్మమ్మలు మమ్మల్ని బెదిరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకొని మా కుటుంబానికి తక్షణం రక్షణ కల్పించండి.
– బుర్రి వెంకటరావు, బయ్యవరం, క్రోసూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment