పరస్పర సహకారంతో అభివృద్ధి
నరసరావుపేట: ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ సహకార ఏడాదిగా గుర్తించినందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. దీనికి సంబందించిన ఐవైసీ పోస్టర్‌ను సోమవారం సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించి, కార్యక్రమం ఉద్దేశాలను వివరించారు.
వేస్ట్ పికర్స్‌కు బల్ల బండ్లు అందజేత..
చెత్తను సేకరించే వృత్తి నుంచి వ్యాపార రంగంలోకి ఎస్టీ యానాదులు మార్పు చెందాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆకాంక్షించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో వేస్ట్ పికర్స్‌కి జీవనోపాధులు మెరుగుపర్చుకునేందుకు నాలుగు చక్రాలు, మూడు చక్రాల బల్లబండ్లను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజినల్ కో–ఆర్డినేటర్ మల్లెల చిన్నప్ప, నరసరావుపేట ఏరియా కో–ఆర్డినేటర్ తోకల సాంబయ్య పాల్గొన్నారు.
పీ–4 కార్యాచరణలో భాగస్వాములు కండి
స్వర్ణాంధ్ర–2047లో భాగంగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు పీ4 విధానం అమలుకు కసరత్తు జరుగుతోందని, ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సీపీఓ ఆధ్వర్యంలో పీ–4కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. జేసీ సూరజ్ గనోరే, డీఆర్వో మురళి పాల్గొన్నారు. అదేవిధంగా ఢిల్లీ నుంచి జల్ శక్తి మంత్రిత్వ శాఖ జల్‌శక్తి అభియాన్ ‘జల్ సంచయ్ జన్ భగీదారి’పై దేశవ్యాప్తంగా 80 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వర్చువల్ విధానంలో కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్.పాటిల్ నిర్వహించిన సమీక్షకు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి పాల్గొన్నారు.
ఈ ఏడాది అంతర్జాతీయ సహకార ఏడాదిగా గుర్తింపు
పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment