మేడికొండూరు: మండల పరిధిలోని డోకిపర్రులోని జోసిల్ కర్మాగారంలో జాతీయ భద్రత వారోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆ సంస్థ సెక్రటరీ, డీజీఎం కోటా రఘురాం మాట్లాడుతూ మంగళవారం నుంచి పదో తేదీ వరకు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ భద్రతా ప్రమాణాలను పాటించాలని కోరారు. ఈ సందర్భంగా కార్మికులకు, ఉద్యోగులకు పలు రకాల పోటీలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంస్థ అడ్వైజర్లు రామినేని బెనర్జీ బాబు, యడ్లపాటి భాను ప్రసాద్ పాల్గొన్నారు.
మిర్చి యార్డులో 1,27,375 బస్తాల విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు మంగళవారం 1,25,574 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,27,375 బస్తాలు అమ్మకాలు జరిగాయి. ఈ సీజన్‌లో ఈ స్థాయిలో మిర్చి బస్తాలు రావడం ఇదే ప్రథమం. శని, ఆదివారాలు యార్డుకు సెలవు కావడంతో ఆదివారం రాత్రి నుంచే వాహనాల్లో మిర్చి బస్తాలను తీసుకురాగా యార్డు నిండిపోయింది. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. ఇంకా 70,117 బస్తాలు నిల్వ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment