కబడ్డీ జట్ల ఎంపిక
బాపట్ల: బాపట్ల మున్సిపల్ హైస్కూలులో మంగళవారం ఉమ్మడి గుంటూరు జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ బాలబాలికల జట్ల ఎంపిక నిర్వహించారు. ఎంపికై న జట్లు ఈనెల 14,15,16 తేదీలలో కడప జిల్లాలో జరిగే అంతర జిల్లాల కబడ్డీ పోటీల్లో పాల్గొంటాయని గుంటూరు జిల్లా (కబడ్డీ) సెక్రటరీ మంతెన సుబ్బరాజు తెలిపారు. బాలికల జట్టులో జె.ప్రవల్లిక, సారిక, కీర్తి, హాసిని, సలోమి, ఆసిఫా, అమూల్య, శ్రావ్య (నరసాయపాలెం), కీర్తన(పేరలి), అంజలి, భార్గవి (నిజాంపట్నం), మౌనిక, దుర్గ, యామిని (ఎంపీపాలెం), బాలుర జట్టు ఎస్.హేమంత్, జ.మహిమరాజు, ఎస్.కె జుబెల్, కె.మణికంఠరెడ్డి, శ్రీనివాసులు, ప్రభు, ప్రశాంత్ (మునిసిపల్ హైస్కూల్, బాపట్ల), సాయి హర్షవర్ధన్ రెడ్డి, నాగభూషణ్, తేజ, చిన్న అయ్యప్ప (కర్లపాలెం), సుబ్బారావు, పోల్‌రెడ్డి (పేరలి), ప్రేమ్‌చంద్, మణి (దాచేపల్లి)లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో పీడీలు కత్తి శ్రీనివాసరావు, ఎన్.కుటుంబరావు, పి. శైలజ, కోచ్ తిరుపతమ్మ (పి.ఈ.టి) ఎం.సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ల్యాండ్ పూలింగ్‌కు రైతులు డిమాండ్
అమరావతి: మండల పరిధిలోని వైకుంఠపురం గ్రామంలో పెన్నాగోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకు అవసరమైన భూములు ల్యాండ్ పూలింగ్ కింద మాత్రమే ఇస్తామని రైతులు మంగళవారం సర్వే అధికారులను ఆడ్డుకున్నారు. మంగళవారం వైకుంఠపురం గ్రామ పరిధిలో పెన్నా గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టులో పంప్‌హౌస్ నిర్మాణానికి భూసర్వే చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. తమ భూముల సంగతి తేల్చిన తర్వాతే సర్వే చేయాలని మండల సర్వేయర్, వీఆర్‌వో తదితర సిబ్బందిని వెనక్కి పంపిచేశారు. ఈ సందర్భంగా రైతు భోగినేని సుబ్బారావు మాట్లాడుతూ.. రాజధానికి దగ్గరగా ఉన్న వైకుంఠపురం గ్రామంలో 56.88 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టుకు సేకరించాలని నిర్ణయించారన్నారు. తాము భూసేకరణకు అంగీకరించబోమని చెప్పారు. కార్యక్రమంలో బాధిత రైతులు పాల్గొన్నారు.
కబడ్డీ జట్ల ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment