7 నుంచి కృత్రిమ అవయవాలు పంపిణీ
అచ్చంపేట: దివ్యాంగులకు ద చేంజ్ మేకర్స్ సంస్థ, ఆర్కే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7, 8, 9వ తేదీలలో విజయవాడలోని సి.వి.రెడ్డి హాల్‌లో కృత్రిమ అవయవాలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు నిర్వహకులు కమల్‌సైదా మంగళవారం అచ్చంపేటలో విలేకరులకు తెలిపారు. అవసరమైన వారు వివరాలను 70138 31026, 95505 45539, 83676 75615 ఫోను నెంబర్లకు వాట్సాప్ ద్వారా పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
కాపుసారా విక్రయిస్తే కఠిన చర్యలు
అచ్చంపేట: గ్రామాలలో కాపుసారా విక్రయించినా, కాచి అమ్మినా కఠిన చర్యలు తప్పవని ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్‌మెంట్ రవికుమార్‌రెడ్డి హెచ్చరించారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా మండలంలోని కంచుబోడు, జడపల్లి, సండ్ర తండాలలో ఆయన పర్యటించారు. అన్ని ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన తండా వాసులతో మాట్లాడారు. కాపుసారా తాగడం వల్ల అనారోగ్యం పాలవుతారని, కుటుంబాలకు దూరం అవుతారని చెప్పారు. కుటుంబంతో చక్కగా జీవించాలని, సన్మార్గంలో నడుచుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సూర్యనారాయణ, క్రోసూరు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ తులసి, ఎస్‌ఐలు శ్రీనివాస్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి శిక్షణకు నందిగామ సర్పంచ్
సత్తెనపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్లలోని ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ సెంటర్‌లో ఈ నెల 5, 6వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ శిక్షణ సంస్థ ‘ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీలు’ అంశంపై రెండు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించనుంది. పల్నాడు జిల్లా నుంచి సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామ సర్పంచ్ బలిజేపల్లి రమాదేవి, పంచాయతీ కార్యదర్శి చిలువూరి కృష్ణప్రసాద్ దీనికి ఎంపిక అయినట్లు సత్తెనపల్లి ఎంపీడీఓ బండి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఒక్కో జిల్లా నుంచి ఎంపిక అయిన 26 మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొంటారన్నారు.
7 నుంచి కృత్రిమ అవయవాలు పంపిణీ
7 నుంచి కృత్రిమ అవయవాలు పంపిణీ
Comments
Please login to add a commentAdd a comment