ముగిసిన బాల్ బాడ్మింటన్ పోటీలు
నరసరావుపేట రూరల్: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర కళాశాలల మహిళల బాల్ బాడ్మింటన్ పోటీలు మంగళవారం ముగిశాయి. రెండు రోజలపాటు కేసానుపల్లిలోని ఎంఏఎం ఫార్మసీ కళాశాలలో ఈ పోటీలు నిర్వహించారు. విజేతగా జేఎంజే మహిళా కళాశాల (తెనాలి) ప్రథమ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వ్యాయామ కళాశాల ద్వితీయ, ఎంఏఎం ఫార్మసీ కళాశాల (కేసానుపల్లి) తృతీయ బహుమతులు సాధించాయి. పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా చిలకలూరిపేట శ్రీ నిఖిల టెక్నో స్కూల్ డైరక్టర్ వాలేటి శిరీష, వర్సిటీ యోగా సెంటర్ కో ఆర్టినేటర్ డి.సూర్యనారాయణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఆటలో గెలుపు, ఓటములు సహజమని తెలిపారు. కళాశాల చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు మాట్లాడుతూ క్రీడలతో పోరాట స్ఫూర్తి అలవడుతుందని తెలిపారు. విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులు అందజేశారు. కళాశాల డైరక్టర్ దరువూరి శ్రావ్య, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ప్రసాదరావు, ఫిజికల్ డైరక్టర్ జె.శంకర్, సెలక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ సీహెచ్ వెంకట్రావు, జె.ప్రేమ్‌కుమార్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment