ప్రగతికి రోల్ మోడల్
సత్తెనపల్లి: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిరుపేద విద్యార్థులకు సైతం కార్పొరేట్ విద్య అందాలనే సత్సంకల్పంతో ఏపీ మోడల్ పాఠశాలలను 2013లో ప్రారంభించారు. మహానేత ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుతం పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. పల్నాడు జిల్లాలో 14 మోడల్ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో 100 చొప్పున 6వ తరగతిలో ప్రవేశానికి 1400 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తులకు ఆహ్వానం...
మోడల్ పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఆన్‌లైన్‌లో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 31వరకు కొనసాగుతుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థి అర్హతను పరిశీలించి అర్హుడను తేలితే క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి గేట్‌వే ద్వారా రుసుము చెల్లిస్తే ఓ జర్నల్ నెంబర్ కేటాయిస్తారు. ఆ నెంబర్ ఆధారంగా ఠీఠీఠీ. ఛిట్ఛ. ్చఞ. జౌఠి. జీుఽ లేదా ఠీఠీఠీ. ్చఞఝట. ్చఞఛిజటట. జీుఽ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత నకలును పాఠశాలో సమర్పించాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష...
ఆరో తరగతి ప్రవేశానికి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న స్కూల్‌లోనే పరీక్ష ఏప్రిల్ 20న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా రోస్టర్ ప్రకారం సీట్లను కేటాయించనున్నారు. ఏప్రిల్ 27న మెరిట్‌లిస్ట్ అదేరోజు సెలక్షన్ లిస్ట్‌ను వెల్లడిస్తారు. ఏప్రిల్ 30న సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయి.
దాచేపల్లిలోని మోడల్ స్కూల్ భవనం
నోటిఫికేషన్ జారీచేసిన విద్యాశాఖ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం జిల్లాలో 14 మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు ఒక్కో మోడల్ స్కూల్‌లో 100 సీట్లు చొప్పున జిల్లాలో 1400 మందికి అవకాశం
ముఖ్యంగా గుర్తుంచుకోవలసినవి..
6వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 2013 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2015 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. వీరు కనీసం 35 మార్కులు పొంది ఉండాలి. పరీక్ష ఫీజు రూ.150 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 2011 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2015 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. వీరు కనీసం 35 మార్కులు పొంది ఉండాలి. పరీక్ష ఫీజు రూ.75 చెల్లించాలి
సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2023–24, 2024–25 విద్యా సంవత్సరాల్లో 4,5 తరగతుల్లో చదివి ప్రమోషన్‌కు అర్హత పొంది ఉండాలి
పరీక్షలో వచ్చే మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు
ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది
5వ తరగతి స్థాయిలో ఉండే ఈ పరీక్షను తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో రాయవచ్చు
ఇక్కడ సీటుకు చాలా డిమాండ్
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలోని పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మోడల్ స్కూల్ ప్రవేశాల ప్రక్రియపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలనే ధ్యేయంతో ఏపీ మోడల్ స్కూళ్లను తీసుకొచ్చారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన జరుగుతుంది. ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
– బత్తుల శ్రీనివాసరెడ్డి, ఏడీ, మోడల్ పాఠశాలలు, పల్నాడు జిల్లా
పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కూడా ఉన్నత చదువులు అందుబాటులోకి తీసుకురావడమే ధ్యేయంగా ఏపీ మోడల్ పాఠశాలలు ఏర్పాటయ్యాయి. ఆయా పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశం పొందితే ఇంటర్‌వరకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించడంతోపాటు విద్యాకానుక కిట్లు, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తారు. పూర్తి ఇంగ్లిష్ మీడియంతో సత్ఫలితాలను సాధిస్తున్న మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పొందడం అంత ఈజీ కాదు. ప్రైవేట్ పాఠశాలల్లో ఎంత ఖర్చుపెట్టినా అందుబాటులో లేని నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య ఇక్కడ లభ్యం కావడం పేద పిల్లలకు వరంగా మారింది.
ప్రగతికి రోల్ మోడల్
Comments
Please login to add a commentAdd a comment