పసుపు రైతులకు త్వరితగతిన పరిహారం
తెనాలి: దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ గతేడాది జనవరిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై రైతు సంఘం నేతలు గురువారం తెనాలిలో సబ్ కలెక్టర్ సంజనా సింహాను కలిశారు. రైతులకు రావాల్సిన పరిహారంపై ప్రభుత్వం ఇచ్చిన హామీని త్వరితగతిన నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వేములపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కోల్ట్ స్టోరేజీ అగ్ని ప్రమాదం దుర్ఘటనకు సంబంధించి, మొత్తం 380 మంది పసుపు రైతులకు పరిహారం అందాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం ఆమోదించిన పరిహారం మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించాలని కోరామని, సబ్ కలెక్టర్ సంజనా సింహ ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివ సాంబిరెడ్డి మాట్లాడుతూ పసుపు రైతులకు పరిహారంపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఎనిమిది నెలల క్రితం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరకపోవడంపై విచారం వ్యక్తంచేశారు.
సబ్ కలెక్టర్‌ను కోరిన రైతు సంఘం బృందం
Comments
Please login to add a commentAdd a comment