No Headline
నగరంపాలెం: మహిళా దినోత్సవం సందర్భంగా చేపట్టిన మహిళా ఫిర్యాదుల విండోకు విశేష స్పందన లభించిందని ట్రైనీ ఐపీఎస్ అధికారిణి దీక్ష చెప్పారు.ఎస్పీ సతీష్‌కుమార్ నేతృత్వంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్‌స్టేషన్లలో మహిళా ఫిర్యాదుల విండో కార్యక్రమాన్ని నిర్వహించారు. చి మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది ఫిర్యాదులు స్వీకరించారు. కొన్ని ఫిర్యాదులను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 64 మంది మహిళలు ఫిర్యాదులివ్వగా, అందులో 57 సమస్యలను తక్షణం పరిష్కరించినట్టు అధికారులు చెప్పారు. ఈ సదర్భంగా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి దీక్ష మాట్లాడుతూ ప్రత్యేక ఫిర్యాదుల విండో మంచి కార్యక్రమమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment