విద్యుత్ చౌర్యం సామాజిక నేరం
సీఆర్‌డీఏ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం
మహిళా ఫిర్యాదుల విండోకు విశేష స్పందన
చిలకలూరిపేట: విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని సీఆర్‌డీఏ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.సుబ్రహ్మణ్యం తెలిపారు. విద్యుత్ విజిలెన్స్ అధికారుల బృందం శుక్రవారం కనెక్షన్ల తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో 35 మంది అధికారులు, 105 మంది సిబ్బంది 35 బృందాలుగా ఏర్పడి 2,074 సర్వీసులు తనిఖీ చేసి, రూ.3.08 లక్షల అపరాధ రుసుం విధించినట్లు అధికారులు తెలిపారు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మీటరు ఉన్నప్పటికీ అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఒకరిని గుర్తించి రూ.10 వేలు, ఇతర కేటగిరిలో విద్యుత్ వినియోగిస్తున్న మరొకరిని గుర్తించి రూ.10 వేలు చొపజరిమానా విధించినట్లు తెలిపారు. అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్ వినియోగించుకుంటున్న 55 మందిని గుర్తించి రూ.2.86 లక్షలు జరిమానా విధించటం జరిగిందన్నారు. దాడుల్లో ఈఈలు సీహెచ్ వెంకటేశ్వరరావు, బి.సంజీవరావు, డీఈఈలు ఎన్‌ఎం ప్రసాద్, ఆర్.అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
57 ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం
Comments
Please login to add a commentAdd a comment