విద్యా రంగానికి కళ
జిల్లా విద్యా రంగాన్ని మహిళా అధికారులే ఏలుతున్నారు. పాఠశాల విద్య జిల్లా విద్యాశాఖాధికారిగా ఎల్.చంద్రకళ, ఇంటర్‌విద్యాశాఖాధికారిగా ఎం.నీలావతిదేవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో నూతనంగా ఏర్పడిన జిల్లాలో శాశ్వత కార్యాలయం లేక అద్దె భవనంలో కొనసాగుతున్న జిల్లా విద్యా శాఖ కార్యాలయానికి తాను డీఈఓగా బాధ్యతలు చేపట్టిన చంద్రకళ వెంటనే పరిష్కారాన్ని చూపారు. నిరుపయోగంగా ఉన్న ఎన్‌బీటీ అండ్ ఎన్‌సీవీ కళాశాల హాస్టల్ గదులను జిల్లా కలెక్టర్ సహకారంతో డీఈఓ కార్యాలయంగా మార్చారు. ఆమె పర్యవేక్షణలో విద్యాశాఖ సిబ్బంది వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని తమ కార్యాలయాన్ని తీర్చిదిద్దుకున్నారు. నిత్యం ఏదో ఒక పాఠశాలను సందర్శిస్తూ బాలికలకు చదువు ప్రాధాన్యతను వివరిస్తున్నారు.
బాలికలను చదివించాలి..
సమాజంలో ప్రతి ఒక్కరూ బాలికల విద్య పట్ల శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాల విద్యతోనే ఆపివేయకుండా వారికి ఉన్నత విద్యను అందించాలి. చదువుతోనే ఏదైనా సాధించగలమని మహిళలు గుర్తించాలి. బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించారు. మహిళలు సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు.
–ఎల్.చంద్రకళ, డీఈఓ, పల్నాడుజిల్లా
Comments
Please login to add a commentAdd a comment