
పల్నాడు
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025
నేడే ఆంజనేయస్వామి తిరునాళ్ల
రొంపిచర్ల: మండలంలోని గోగులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సువర్చలా సమేత అభయాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు
చేశారు.
రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు
పెదపులివర్రు(భట్టిప్రోలు): పెదపులివర్రు గ్రామంలో కొలువైన శ్రీ భూనీళా సమేత వరదరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.
ప్రసన్నాంజనేయస్వామి జయంతి
రాజుపాలెం: మండలంలోని ఆకుల గణపవరంలో ప్రసన్నాంజనేయస్వామి జయంతి మహోత్సవం సందర్భంగా శనివారం లక్ష తమలపాకుల పూజ చేశారు.
ఇఫ్తార్ సహర్
(ఆది) (సోమ)
నరసరావుపేట 6.24 5.06
గుంటూరు 6.22 5.04
బాపట్ల 6.22 5.04
ముప్పాళ్ళ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే వ్యవసాయ సంబంధిత పథకాలు, రాయితీలు వంటివి ఇకపై కౌలు రైతులు, డీకే పట్టా భూములున్న వారు, అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు ఇకపై దూరం కానున్నాయి. ఆధార్ కార్డు తరహాలోనే దేశంలోని ప్రతి రైతుకు విశిష్ట సంఖ్యతో భూ ఆధార్ కార్డులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న రోజుల్లో ఈ కార్డులున్న వారికే పీఎం కిసాన్, అన్నదాతా సుఖీభవ పెట్టుబడి సాయం, వ్యవసాయ సంబందిత పథకాలు, రాయితీలపై పరికరాలు, పంటల బీమా, పంట విక్రయాలు, రుణాలపై వడ్డీ రాయితీ, సూక్ష్మ సేద్యంపై రాయితీ వంటి ప్రోత్సాహకాలు అందించనున్నట్లు నిబంధనల్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే భూ ఆధార్ కార్డుల జారీకి ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలు నమోదు ప్రక్రియను రైతు సేవా కేంద్రాల్లో ప్రారంభించింది. ఈ నెల 25వ తేదీలోపు వివరాలు నమోదు చేసుకోవాలని గడువు కూడా విధించింది. అయితే భూ ఆధార్ పొందేందుకు సొంతంగా భూములున్న రైతులే అర్హులని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కౌలు రైతులు, డీకే పట్టా భూములున్న దళిత, ఇతర రైతులు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. గతంలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం రెవెన్యూ గ్రామసభలు నిర్వహించి అర్హులైన వారికి కౌలు రైతు గుర్తింపు కార్డులు మంజూరు చేసింది.
అలాగే ఇనాం భూములు సాగు చేసుకుంటున్న రైతులు ఉన్నారు. సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో మొత్తం సుమారు 44,741 రైతులు ఉన్నారు. వీరు కాక 18,346 మంది కౌలు రైతులు, ఇనాం భూములు, అటవీ భూములు సాగు చేసే వారు ఉన్నారు. వీరంతా భూ ఆధార్‌కు అర్హులు కారని వ్యవసాయ అధికారులు చెబుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దమ్మాలపాడులో భూ ఆధార్ నమోదు చేస్తున్న వ్యవసాయ శాఖ సిబ్బంది
7
తీవ్ర నష్టం తప్పదు
న్యూస్‌రీల్
ప్రభుత్వం అండగా ఉండాలి
గతంలో కౌలు రైతులకు
యజమానులకే భూ ఆధార్ నమోదు
ఫార్మర్ రిజిస్ట్రీలో కౌలు రైతులకు
చోటు దక్కకపోవడంతో అన్యాయం
భూ ఆధార్ నమోదైతేనే అందనున్న ప్రభుత్వ పథకాలు, రాయితీలు
ప్రక్రియనే నిలిపివేయాలని రైతు
సంఘాలు డిమాండ్
సాగు చేసే రైతుకే వర్తింపజేయాలి
కొత్త విధానంతో కౌలు రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా వారికి గుర్తింపు నెంబర్ ఇవ్వాలి. కేవలం సొంత భూములున్న వారికే కార్డులు ఇస్తే మిగతా వారి సంగతి ఏం కావాలి? జిల్లావ్యాప్తంగా వేల మంది కౌలు, గిరిజన, దళిత రైతులు పథకాలు అందక నష్టపోతారు. పైగా పంటలకు గిట్టుబాటు ధర అందక, సబ్సిడీ రాక కౌలు రైతులు మరింత నష్టపోతారు. పాత పద్ధతిలోనే అన్ని వర్గాల రైతులకు పథకాలు అమలు చేయాలి.
– వై.రాధాకృష్ణ, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి, పల్నాడు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన భూ ఆధార్ రిజిస్ట్రేషన్‌లో కౌలు రైతులను తీసుకోకపోవటం వల్ల వారు తీవ్రంగా నష్టపోతారు. ప్రభుత్వం అందించే యంత్ర పరికరాలు, సబ్సిడీ విత్తనాలు, బ్యాంకు రుణాలు, అన్నదాతా సుఖీభవ వంటి పథకాలన్నీ అందకుండా పోతే కౌలు రైతు ఎలా బతకాలి? ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీఫ్, రబీ సీజన్‌లలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సాయాన్ని అందించలేదు.
–మువ్వా శ్రీనివాసరావు, కౌలు రైతు,
చాగంటివారిపాలెం, ముప్పాళ్ల మండలం.
భూమి ఉన్న రైతుకే ప్రభుత్వం అన్నీ ఇస్తే కౌలు రైతుల పరిస్థితి ఏంటి? ఎక్కువగా అంతా కౌలు రైతులే ఉంటారు. వారికి గుర్తింపు లేకుండా భూమి ఉన్న వారి పేర్లే రిజిస్ట్రీలో నమోదు చేయటం సరైంది కాదు. సాగు ఎవరు చేస్తారో వారికే సాయం అందిస్తే బాగుంటుంది. అప్పుడే సాగుకు మనుగడ ఉంటుంది.
–శివరాత్రి ఏడుకొండలు,
రైతు, దమ్మాలపాడు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కౌలు రైతులకు ప్రభుత్వం రైతు భరోసా సాయం అందించింది. క్రమం తప్పకుండా ఏడాది రూ.11,500 కోట్లు ఆర్థిక సాయం వారి ఖాతాల్లో జమ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక భూ యజమానులు మాత్రమే పథకాలు అర్హులంటూ భూ ఆధార్ ప్రక్రియ చేపట్టడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు మేలు చేయని ఇలాంటి విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ వినిపిస్తోంది. గతంలో మాదిరిగా అందరికీ పథకాలు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఇలాంటి ఉపయోగం లేని ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సర్కారు తీరు మారకుంటే మండల స్థాయిలో ఉద్యమ కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుందని కౌలు రైతు సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు.

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు
Comments
Please login to add a commentAdd a comment