సమాజాభివృద్ధిలో అతివల పాత్ర కీలకం
సత్తెనపల్లి: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లాలో ఏకై క మోడల్ మహిళా స్నేహ పూర్వక గ్రామంగా ఎంపికై న నందిగామలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం మండల స్థాయిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాస్కరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలను గౌరవించాలని, మగవారి ఎదుగుదల వెనుక సీ్త్ర ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. నందిగామ ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్ జిల్లాస్థాయిలో మంచి గుర్తింపు కలిగి ఉందని, ఈ స్ఫూర్తిని కొనసాగించాలని ఇక్కడి హరిత రాయబారులను ప్రశంసించారు. ఉత్తమ మోడల్ మహిళా ఫ్రెండ్లీ గ్రామంగా ఎంపికై న నందిగామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సత్తెనపల్లి ఎంపీడీఓ బండి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళా గ్రీన్ అంబాసిడర్లను, అన్ని శాఖల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని పూలమాలలు, దుశ్శాలువాలతో సన్మానించారు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించి, హాకీలో జాతీయస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించిన ధరణిని సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామంలోని మహిళలు, ఉద్యోగినిలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఆళ్ల సాంబయ్య, ఈటీసీ బాపట్ల ఫ్యాకల్టీ మెంబర్ ఆర్.వర్ధని, డీటీఎం నాగేశ్వరరావు, డీఆర్‌పీ ఎం.నరసింహనాయక్, డీఎల్‌సీఓ అహ్మద్ బీ, గ్రామ సర్పంచ్ బి.రమాదేవి, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి భాస్కరరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment