ఏదో ఒక చోట ఆపేయాలి
మద్యపానం, ధూమపానం లాగా బెట్టింగ్ సైతం ఓ వ్యసనం. ఆ వ్యసనం ముదిరితే వ్యాధిగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ‘గ్యాంబ్లింగ్ డిజార్డర్’గా గుర్తించింది. మొదట సరదాగా మొదలయ్యే ఈ జూదం గెలిచినప్పుడు మరింత గెలవాలన్న ఆశతో, ఓడినప్పుడు పోయిన చోటే తిరిగిపొందాలన్న కసితో అప్పులు చేసైనా ఆడుతారు. చివరికి అప్పులు ఊబిలో కూరుకుపోయి డిప్రెషన్‌కు గురవుతారు. కొంతమంది చనిపోవాలన్న కఠినమైన నిర్ణయం తీసుకుంటారు. ఈ వ్యసనాన్ని ఏదో ఒక చోట ఆపగలిగి, మానసిక వైద్యుడిచేత కౌన్సిలింగ్ అందజేస్తే ఆత్మహత్యల వరకు వెళ్లే ప్రమాదం తప్పుతుంది.
– డాక్టర్ వీవీ కిరణ్,
అసోసియేట్ ప్రొఫెసర్, మానసిక వ్యాధుల వైద్యవిభాగం, జీజీహెచ్, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment