ప్రకృతే దేవుని ఆయుధం
అమరావతి: ప్రకృతే దేవుని ఆయుధమని, ప్రభువైన ఏసుక్రీస్తు మనపక్షాన నిలిస్తే ప్రకృతిలోని పంచభూతాలు సహకరించి ఆనందింపచేస్తాయని పాస్టర్ రమేష్ అన్నారు. శనివారం మండల పరిధిలోని లేమల్లె హోసన్నా దయాక్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 48వ గుడారాల పండుగ మూడవరోజు రాత్రి సమయంలో ప్రార్థనలకు వచ్చిన లక్షలాది మంది విశ్వాసులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేవుని చేతిలో ఉన్న అతిపెద్ద ఆయుధం ప్రకృతి అని, దానిని మనం కాపాడుకోవాలన్నారు. ప్రకృతిలో గాలి, నీరు పంచభూతాలు ఎంతో శక్తివంతమైనవని, అలాంటి శక్తివంతమైన ఆయుధాలను వశపరుచుకున్న సర్వశక్తి మహిమగల దేవుడిని మనం స్తుతించాలన్నారు. హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు పాస్టర్ అబ్రహాం, చీఫ్ పాస్టర్ జాన్‌వెస్లీలు దయాక్షేత్రం పాటల పుస్తకంలోని దేవుని గీతాలను అలపించారు. రెండవ వర్తమానంలో ఒంగోలుకు చెందిన పాస్టర్ రాజు మాట్లాడుతూ దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ఆరాధించాలన్నారు. పాస్టర్ అనిల్ మాట్లాడుతూ దేవుని వాక్యాలను మన హృదయాలలో స్థిరపరుచుకుని నిరంతరం ధ్యానించాలన్నారు. తిరుపతికి చెందిన పాస్టర్ సాగర్ బృందం, సిస్టర్ ప్రేమ బృందం స్తుతి గీతాలు ఆలపించారు. అదేవిధంగా హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహిస్తున్న బైబిల్ కాలేజీలో 2024వ సంవత్సరంలో శిక్షణ పొందిన 183 మంది విద్యార్థులకు సర్టిఫికేట్‌లు ప్రదానం చేశారు. ఈ ప్రార్థనల్లో దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాదిమంది విశ్వాసులు పాల్గొన్నారు.
హోసన్నా మినిస్ట్రీస్ పాస్టర్ రమేష్
కొనసాగిన 3వ రోజు గుడారాల పండుగ ప్రార్థనలు
ప్రకృతే దేవుని ఆయుధం
ప్రకృతే దేవుని ఆయుధం
ప్రకృతే దేవుని ఆయుధం
Comments
Please login to add a commentAdd a comment