పీ–4 సర్వే ప్రారంభం
సత్తెనపల్లి: పేదరిక నిర్మూలనకు నిర్వహించనున్న పీ–4 (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్ షిప్) ను ఉగాది నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సత్తెనపల్లి మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో ఈ సర్వే శనివారం నుంచి ప్రారంభమైంది. ఈనెల 18వ తేదీకి సర్వే పూర్తి చేయనున్నారు.
అడుగుతున్న ప్రశ్నలు ఇవి...
● కుటుంబ యజమాని పేరు
● ఆధార్, సెల్‌ఫోన్ నెంబర్
● ఇంట్లో సభ్యులు ఏ పని చేస్తున్నారు
● నెలకు కుటుంబ ఆదాయం ఎంత
● డిగ్రీ, ఆ పైన చదివిన వారెందరు
● వృత్తి, వ్యవసాయం, భూమి, పట్టణ ఆస్తి వివరాలు, వాహనాలు
● ఇంటి స్థితి
● వంటగ్యాస్ వినియోగిస్తున్నారా!
● కుళాయి కనెక్షన్ ఉందా!
● టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీ, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం
● కుటుంబ నెలవారీ ఖర్చు
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ ఏ పథకాలు అందుతున్నాయి. తదితర వివరాలను సేకరిస్తున్నారు.
ఇదీ షెడ్యూల్...
సత్తెనపల్లి మండలంలో శనివారం సర్వే ప్రారంభమైంది. ఈనెల 18వ తేదీలోగా పూర్తి చేయాలి. 21 నుంచి 23 వరకు గ్రామాల వారీగా సభలు నిర్వహించి వివరాలు వెల్లడిస్తారు. 24 నుంచి 26 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ నెల 27 నుంచి 29 వరకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి తుది జాబితా ప్రకటిస్తారు. 30న ఉగాదికి కార్యక్రమ వివరాలు ప్రకటిస్తారు.
వీరికి మినహాయింపు...
● గ్రామీణ ప్రాంతాల్లో 10 ఎకరాల భూమి ఉన్న వారు
● పట్టణ ప్రాంతాల్లో సొంత నివాసం ఉన్నవారు
● నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నవారు
● ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు
● ఆదాయపు పన్ను చెల్లించేవారు
● 200 కంటే ఎక్కువ యూనిట్లు విద్యుత్ వినియోగించే వారి వివరాలు సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా పేదరికం రూపుమాపేందుకు ప్రభుత్వ ఈ సర్వే చేపట్టిందని ఎంపీడీఓ బండి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment