భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి సాగర్‌మాత
విజయపురిసౌత్: ఎందరో భక్తులకు దర్శనం ఇస్తూ కోరిక కోరికలు తీర్చే తల్లి సాగర్‌మాత అని నెల్లూరు సహవారస పీఠాధిపతులు డాక్టర్ పిల్లి అంతోని ఉద్భోధించారు. రెండో రోజైన శనివారం ఆయన సాగరమాత ఆలయంలోని జపమాల క్షేత్రంలో ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్ ఆధ్వర్యంలో జరిగిన సమష్టి దివ్యబలిపూజలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్రైస్తవ భక్తులంతా సమాజానికి ఆదర్శవంతంగా నిలవాలన్నారు. సాటివారిని ఆదరించడం, ప్రేమను పంచిపెట్టడం క్రైస్తవ్యం ప్రధాన లక్షణమన్నారు. సృష్టికర్త సైతం అమ్మ ద్వారానే ఈ లోకానికి వచ్చాడన్నారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమన్నారు. మరియమాత మన మధ్యలో నిలిచి కాపాడుతుందన్నారు. గురుశ్రీ చిన్నాబత్తిని కిరణ్‌కుమార్, తుమ్మా కరుణాకరరెడ్డి, గురుశ్రీ పామిశెట్టి బాలస్వామి, గురుశ్రీ ఆర్ రాజు, గురుశ్రీ అల్లం చిన్న శౌరెడ్డి, గురుశ్రీ రవికుమార్‌లచే దివ్య బలిపూజ, స్తుతి ఆరాధనలు జరిగాయి. రాత్రి తేరు ప్రదక్షిణ,సాగర్‌మాత బృందం వారిచే సాగర్‌మాత మహిమలు బుర్రకథ, 9గంటలకు శిలువ ధారి బైబిల్ నాటకం కార్యక్రమాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment