నూతన కార్యవర్గం ఎన్నిక
చీరాల టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏపీ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షునిగా జమండ్లమూడి శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. ఆదివారం పట్టణంలోని డోలా ఐజాక్ ఎన్జీవో భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి, మాజీ సలహాదారు షేక్ యూసుఫ్ మొహరాలి అధ్యక్షతన నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం అధ్యక్షులుగా జమండ్లమూడి శ్రీనివాసరావు, సహాధ్యక్షులుగా ఎన్.కృపాచార్యులు, జనరల్ సెక్రటరీగా సాయి మహేష్, ఉపాధ్యక్షులుగా ఎం.వెంకటేశ్వర్లు, కోశాధికారిగా సూర్యనారాయణ, సభ్యులను ఎన్నుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం బలోపేతం చేయడంతోపాటు హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అందరం ఐక్యమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment