‘ఫైనాన్స్’ ఆగడాల నుంచి రక్షించండి
● పీజీఆర్‌ఎస్‌లో బాధితురాలి వినతి ● ప్రజల నుంచి 62 అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు
నరసరావుపేట: తన భర్త బాజీవలి స్టార్ ఫైనాన్స్ వద్ద రూ.5లక్షలు రుణం తీసుకొని కరోనా సమయంలో చనిపోయాయని, తాను ఇప్పటివరకు రూ.4.50లక్షలు చెల్లించానని, ఇంకా చెల్లించాలంటూ కోర్టు ఆదేశాల లేకుండానే తమ ఇంటికి తాళాలు వేసిన సదరు ఫైనాన్స్ ప్రతినిధులు నెలరోజులు వేధించారని, వారే ఇప్పుడు తాళాలు తీసి.. ఇంకా రూ.10లక్షలు చెల్లించాలని వేధిస్తున్నారని, తనకు అంత స్థోమత లేదని, వారి ఆగడాల నుంచి రక్షించాలని చిలకలూరిపేట పండరీపురంకు చెందిన సయ్యద్ ఆయేషా ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం కలెక్టరేట్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్‌ఓ ఎ.మురళి, అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుంచి 62 అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మండలాల్లో జీఎస్‌డబ్లుఎస్ సర్వే, పీ–4 సర్వే, ఎంఎస్‌ఎంఈ సర్వే పురోగతిని కూడా పర్యవేక్షించాలని కోరారు.
అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు..
నకరికల్లు మండలం దేచవరంలో చర్మకారులైన తమకు ప్రభుత్వం ఒక ఎకరం పొలం కేటాయించగా దానిని సాగుచేసుకుంటూ జీవిస్తున్నాం. గ్రామ టీడీపీ నాయకుడు వెంకయ్య ఈ భూమిని అక్రమంగా ఆన్‌లైన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దుచేయించి చర్మకారుల సంఘానికి ఆ భూమిని అప్పచెప్పండి.
– కనుమూరి ఆదెయ్య, వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జి.రామకృష్ణ,
చర్మకారుల సంఘ నాయకులు
‘ఫైనాన్స్’ ఆగడాల నుంచి రక్షించండి
Comments
Please login to add a commentAdd a comment