
చింతమనేనిపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట: మీడియాపై ప్రజాప్రతినిధులే రౌడీలుగా మారి దాడులు చేయించడం క్షమార్హం కాని నేరమని విశ్రాంత పత్రికా సంపాదకులు, గాంధీ స్మారక సమితి అధ్యక్షుడు ఈదర గోపీచంద్ పేర్కొన్నారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై ఈ తరహాలో దాడికి పాల్పడిన చింతమనేని ప్రభాకర్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. దళితులను కులం పేరుతో దూషించినందుకు, మహిళా ఎమ్మార్వోపై దౌర్జన్యం చేసిన నేరచరిత్ర కలిగిన చింతమనేని తీరును నాడు సభ్యసమాజం తీవ్రంగా నిరసించిందని గుర్తుచేశారు. ఆయన బుద్ధి మార్చుకోలేదంటే కారణం రెడ్ బుక్ రాజ్యాంగం, చంద్రబాబు వత్తాసు కారణాలన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు మేల్కొని, చింతమనేనిని మందలించాలన్నారు.
గాంధీ స్మారక సమితి అధ్యక్షుడు ఈదర గోపీచంద్