సంస్కృతి, సంప్రదాయాలు సొంతం చేసుకోవాలి
● మహిళల ఆరోగ్యం కోసం వికాస్
తరంగణి సేవా సంస్థ
● చినజియర్ స్వామి
చీపురుపల్లి: ప్రస్తుత సమాజంలో చిన్న వయస్సు నుంచే పెద్దల దగ్గర నుంచి సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవడమే కాకుండా సొంతం చేసుకోవాలని వేద గురువు, ఉపదేశకుడు చిన్న జియర్ స్వామి బోధించారు. ఈ మేరకు ఆదివారం చీపురుపల్లిలోని ప్రముఖ వ్యాపారులు అంధవరపు హరి, గోవింద నివాసంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన స్థానిక రాధామాధవ్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. పూర్వీకులు పాటించిన సంప్రదాయాలు ప్రతి వ్యక్తి జీవితంపైనా ఎంతో ప్రభావం చూపుతాయన్నారు. పూర్వ సంప్రదాయాలకు ఎంతో గొప్ప విలువ ఉందని అందుకనే పూర్వీకులు పాటించారని తెలిపారు. ప్రస్తుతం ఆ సంప్రదాయాలు తెలియక పిల్లలు తప్పులు చేస్తున్నారని అలాంటప్పుడు పిల్లలను కాకుండా సంప్రదాయాలు నేర్పని తల్లిదండ్రులనే దండించాలని అభిప్రాయ పడ్డారు. సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ మంచిని కోరుకోవాలని అప్పుడే ప్రతి కుటుంబం బాగుంటుందన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలని లేదంటే కుటుంబం రోడ్డున పడుతుందన్నారు. మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలని సూచించారు. న్నారు. ఇటీవల కాలంలో మహిళలను క్యాన్సర్ మహమ్మారి వెంటాడుతోందని, అందుకనే వికాస్ తరంగిణి సేవా సంస్థను 2007లో నెలకొల్పి ఇంతవరకు 30 లక్షల మంది మహిళలకు ఉచితంగా వైద్య సహాయం, అవగాహన కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వికాస్ తరంగిణి సేవా సంస్థకు వలంటీర్లు ఉన్నారని చెప్పారు. మహిళలు అప్రమత్తమై వికాస్ తరంగిణి సేవా సంస్థను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment