రాజాం సిటీ: స్థానిక డీఏవీ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న హనుమంతు జయాన్ చక్కని ప్రతిభ కనబరిచాడు. హైదరాబాద్‌కు చెందిన విశ్వం ఎడ్యుటెక్ నిర్వహించిన జిల్లా, రాష్ట్ర స్థాయి, అబాకస్, వేదిక్ మ్యాథ్స్‌లో ప్రతిభకనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఈ నెల 2న జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలో సీనియర్ విజవలైజింగ్ కేటగిరిలో ద్వితీయ స్థానం సంపాదించాడని పాఠశాల సిబ్బంది తెలిపారు. తన కుమారుడి ప్రతిభపట్ల రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్రరావుతో పాటు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment