నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్‌కు పేర్లు నమోదు చేస
పార్వతీపురం: నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు యువత తమ వివరాలను నమోదు చేసుకోవాలని నెహ్రూ యువ కేంద్రం జిల్లా కె. వెంకట్ ఉజ్వల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని, యువత మేధాశక్తిని ఉపయోగించడంలో ప్రపంచంలో కెల్లా మన దేశం ప్రథమ స్థానంలో ఉండాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పిస్తున్నట్లు తెలిపారు. 18 నుంచి 25ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ యూత్ పార్లమెంట్ పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. యువత మై భారత్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని తరువాత ఒక్క నిమిషం నిడివి కలిగిన ‘‘వాట్ డజ్ వికసిత్ భారత్ మీన్ టూ యూ’’ అనే అంశంపై వీడియో చేసి మార్చి 9 అర్ధరాత్రిలోపు మై భారత్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. స్క్రీనింగ్ చేసి జిల్లా స్థాయిలో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో వన్‌నేషన్, వన్ ఎలక్షన్, పేవింగ్ ది వేఫర్ వికసిత్ భారత్ అనే అంశంపై మూడు నిమిషాలు మాట్లాడాలని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సంస్థ రూపొందించిన వీడియోను వీక్షించేందుకు క్యూఆర్‌కోడ్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment