సెంచూరియన్‌లో ఘనంగా జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

సెంచూరియన్‌లో ఘనంగా జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం

Published Fri, Mar 7 2025 9:45 AM | Last Updated on Fri, Mar 7 2025 9:40 AM

సెంచూరియన్‌లో ఘనంగా జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం

సెంచూరియన్‌లో ఘనంగా జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం

నెల్లిమర్ల రూరల్‌: మండలంలోని టెక్కలి సెంచూరియన్‌ విశ్వ విద్యాలయంలో జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఔషధ విద్యకు పునాది వేసిన ప్రొఫెసర్‌ మహాదేవ్‌ లాల్‌ ష్రాఫ్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పఠానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్‌ ప్రశాంత కుమార్‌ మహంతి మాట్లాడుతూ ఈ ఏడాది ఫార్మా, పార్మసీ ప్రాక్టీస్‌లో వ్యవస్థాపక స్టార్టప్‌లు ప్రోత్సహించడమే ప్రధాన అజెండాగా ప్రభుత్వం పేర్కొందని, ఆ దిశగా విద్యార్ధులు సన్నద్ధం కావాలని సూచించారు.

శిక్షణ ప్రారంభం

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు సెంచూరియన్‌లో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ గురువారం ప్రారంభించారు. గ్రామీణ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకువెళ్తున్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పల్లవి, డిప్యూటీ రిజిస్ట్రార్‌ వర్మ, డీన్‌ అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement