● గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టి.వి.కట్టిమణి
విజయనగరం అర్బన్: నైపుణ్యాలు కలిగిన యువతతో గ్రామీణాభివృద్ధి సాధించవచ్చని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి అన్నారు. వర్సిటీలో ‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ద్వారా గ్రామీణాభివృద్ధి సాధికారపరచడం’ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సును ఆయన ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధిలో వ్యవస్థాపకత ప్రాముఖ్యతను తెలియజేశారు. నైపుణ్య అభివృద్ధి, స్థిరమైన పద్ధతులతో జనాభాను శక్తివంతంచేసే సహాయక కార్యక్రమాలకు వర్సిటీ ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రొఫెసర్ విఘ్నకాంత్ ఎస్.చాట్పల్లి మాట్లాడుతూ జీవనోపాధి మార్గాలను మెరుగుపరుచుకునేందుకు వ్యవస్థాపక వ్యూహాలను గ్రామీణ యువత అనుసరించాలన్నారు. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎస్‌ఎంఎస్) డీన్, ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా, బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం అధిపతి డాక్టర్ ఎ.వి.అప్పసాబా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment