బైక్‌పైనుంచి జారి పడి వ్యక్తి మృతి
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని అలమండ పంచాయతీ నీలకంఠాపురం గ్రామానికి చెందిన కొండగొర్రి నాగేశ్వరరావు(46) బైక్‌పై నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ మేరకు చినమేరంగి ఎస్సై పి.అనీష్ తెలిపిన వివరాల మేరకు నీలకంఠాపురం గ్రామానికి చెందిన నిమ్మక శంకర్రావు తన బైక్‌పై అదే గ్రామానికి చెందిన కొండగొర్రి నాగేశ్వరరావు, పాలక లాలిబాబులను ఎక్కించుకుని గురువారం రాత్రి గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడి గ్రామదేవత పండగకు వెళ్తున్నాడు. ఆ సమయంలో మార్గమధ్యంలో బైక్‌పై నుంచి జారిపడిన నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో 108 సహాయంతో పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. మితిమీరిన వేగంతో వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని, ప్రమాదంలో తమ చిన్నాన్న మృతి చెందాడని కొండగొర్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి...
భోగాపురం: ఈనెల 5వ తేదీన మండంలోని రావివలస ట్రంపెట్ వంతెన కింద ఆగి ఉన్న లారీని ఢీకొని గాయపడిన జోతేంద్ర నారాయణ పాండే(41) చికిత్స పొందుతూ మృతిచెందాడు. విశాఖపట్నానికి చెందిన జోతేంద్ర పాండేను గాయాల పాలైన అనంతరం తగరపువలస ఎన్‌ఆర్‌ఐ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. మృతుడి తండ్రి హరినారాయణ పాండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఎన్వీ ప్రభాకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment