ఎలక్ట్రీషియన్ల కొరత..!
ప్రభుత్వ
ఆస్పత్రుల్లో..
విజయనగరం ఫోర్ట్:
ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగులకు 24 గంటలూ విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండాలి. ఐసీయూ, అత్యవసర విభాగాల్లో చికిత్స పొందే రో గులకు ఒక్క క్షణం విద్యుత్ సరఫరా నిలిచిపోయినా చెప్పలేనంత ఇబ్బంది నెలకొంటుంది. కొందరు రోగులకైతే విద్యుత్ ప్రాణాధారమేనని చెప్పాలి. అటువంటి విద్యుత్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించి, సమస్యలను పరిష్కరించే ఎలక్ట్రీషియన్ల కొర త ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉంది. దీంతో విద్యుత్ సర ఫరాలో అంతరాయం ఏర్పడితే సేవల్లో జాప్యం ఏర్పడుతుంది. జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎలక్ట్రీషియన్ల కొరత నెలకొంది.
100 బెడ్‌లకు ఒక ఎలక్ట్రీషియన్
నిబంధనల ప్రకారం 100 బెడ్‌లకు ఒక ఎలక్ట్రీషియ న్ ఉండాలి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఘోషాస్ప త్రిల్లో 430 బెడ్స్ ఉన్నాయి. సర్వజన ఆస్పత్రికి ఘోషాస్పత్రి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ లెక్కన రెండు ఆస్పత్రుల్లో ఐదుగురు ఎలక్ట్రీషియన్లు ఉండాలి. కానీ రెండు ఆస్పత్రుల్లో ముగ్గురే ఉన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిల్లో ఇద్దరు, ఘోషాస్పత్రిలో ఒకరు ఉన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మేల్, ఫీమేల్ జనరల్ వార్డులు, మేల్, ఫిమేల్ జి.ఈ వార్డులు, మేల్, ఫిమేల్ ఆర్థో వార్డు లు, క్యాజువాలటీ, 30 పడకలు ఐసీయూ, స్టెప్ డౌ న్ ఐసీయూ, ఎమర్జీన్సీ వార్డు, బ్లడ్ బ్యాంక్, ల్యాబొ రేటరీ, ఓపీవిభాగాలు, ఎక్సరే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎంఆర్‌ఐ స్కాన్, సీటీ స్కాన్ విభాగాలు ఉన్నాయి. ఐసీయూ, క్యాజువాలటీ, ఎమర్జెన్సీ వార్డుల్లో చికిత్స పొందే రోగులకు విద్యుత్ ఒక సెకన్ కూడా ఆగకూడదు. పొరపాటున విద్యుత్ సరఫరా నిలిచిపోతే రోగులు తీవ్ర ఇబ్బందే పడే అవకాశం ఉంది. ఈ విభాగాల్లో వెంటిలేటర్, సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు నిరంతరాయంగా ఆక్సిజ న్ అందాలి. అలా అందాలంటే విద్యుత్ నిరంతరాయంగా సరఫరా కావాలి. ఎలక్ట్రీషియన్ల కొరత వల్ల రోగులకు సేవల్లో జాప్యం ఏర్పడుతుందనే విమర్శలున్నాయి. వీరిద్దరిలో ఏ ఒక్కరు సెలవు పెట్టినా ఒక్క ఎలక్ట్రీషియన్ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 24 గంటల పాటు ఒక్కరు విధులు నిర్వ హించడం అనేది కష్టతరమే. ఘోషాస్పత్రిలో 20 పడకల నవజాతి శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం(ఎస్‌ఎన్‌సీయూ) ఉంది. వీరికి సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ ద్వారా నవజాతి శిశువులకు ఆక్సిజన్ అందుతుంది. ఎస్‌ఎన్‌సీయూలో వార్మర్‌లు, ఫోటోథెరిపి పరికరాలు ఉన్నాయి. ఇవి కూడా విద్యుత్ పైనే అధారపడి నడుస్తాయి. వీరితో పాటు గర్భిణులకు హైరిస్క్ గర్భిణుల కోసం ఇక్క డ ఐసీయూ కూడా ఉంది. అదేవిధంగా పిల్లల వా ర్డు, గర్భిణులు వార్డు ఉంది. ఇక్కడ ఒకే ఎలక్ట్రీషియన్ ఉన్నారు. ఏదైనా సమస్య వస్తే ఒక్కడే కావ డంతో సేవల్లో జాప్యం ఏర్పడుతుందని రోగులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎదైనా సమస్య వస్తే సకాలంలో సమస్య పరిష్కారం కావడం లేదనే ఆవేదన రోగుల్లో ఉంది.
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 150 ఏసీలు
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 150 వరకు ఏసీలు ఉన్నాయి. ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డు, బ్లడ్ బ్యాంక్, ఎంఆర్‌ఐ స్కాన్, సీటీ స్కాన్ వంటి వాటిల్లో ఏసీలు నిరంతరాయంగా పని చేయాలి. వీటికి ఏదైనా సమస్య వస్తే రిఫర్ చేయడానికి ఏసీ మెకానిక్ కూడాలేరు. ఏసీలు మరమ్మతులకు గురైతే రోజుల తరబడి బాగు చేయించడం లేదనే వాదన ఉంది. ఏసీలు బాగు చేయడానికి ఏడాదికి ఒకసారి నిర్వహించే మెయింటెనెన్స్ కోసం లక్షలాది రుపాయిలు ప్రైవేటు సంస్థకు చెల్లిస్తున్నారు. ఏసీ మెకానిక్ ఉంటే చాలా వరకు ప్రజాధనం సాదా అయ్యేదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది.
వంద పడకలకు ఒక ఎలక్ట్రీషియన్ అవసరం
ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒకే ఒక్కడు
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 150 వరకు ఏసీలు
కానీ ఒక్క ఏసీ మెకానిక్ కూడా లేరు..
మరమ్మతులు, మెయింటెనెన్స్ పేరిట ప్రైవేటు వారికి రూ.లక్షల చెల్లింపు
ఎలక్ట్రీషియన్ల కొరతతో సేవల్లో జాప్యం
ఎలక్ట్రీషియన్ల కొరత..!
Comments
Please login to add a commentAdd a comment