ఇంటర్మీడియట్‌ ‘ద్వితీయ’ పరీక్షకు 372మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్మీడియట్‌ ‘ద్వితీయ’ పరీక్షకు 372మంది గైర్హాజరు

Published Tue, Mar 11 2025 12:46 AM | Last Updated on Tue, Mar 11 2025 12:45 AM

ఇంటర్

ఇంటర్మీడియట్‌ ‘ద్వితీయ’ పరీక్షకు 372మంది గైర్హాజరు

పార్వతీపురంటౌన్‌: పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర పరీక్షకు 372మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీవీఈఓ మంజులవీణా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామని 7,880 మందికి గాను 7508 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో జనరల్‌ సబ్జెక్టు జువాలజీ–2 పరీక్షకు 4954 మంది హాజరు కావాల్సి ఉండగా 4812 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. ఒకేషనల్‌–2 పరీక్షకు 2926మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2696 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘనలు కాని, మాస్‌కాపీయింగ్‌గాని జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఫ్లయింగ్‌, సిటింగ్‌ స్క్వాడ్‌లు, బల్క్‌ మెంబర్లు పరీక్షలను పర్యవేక్షించారని, పరీక్షలు సీసీ కెమెరా లైవ్‌ స్ట్రీమింగ్‌ ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించినట్లు వివరించారు.

కరాటేలో రెండు గోల్డ్‌ మెడల్స్‌

సీతంపేట: ఈనెల 9న విజయనగరంలోని రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన అంతర్‌ జిల్లా స్థాయి కరాటే పోటీల్లో సీతంపేట మండలంలోని అచ్చిబ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు గోల్డ్‌మెడల్స్‌ సాధించారు. గ్రామానికి చెందిన కె.దీపక్‌, ఎన్‌.హర్షలు బంగారు పతకాలు సాధించడంతో గ్రామస్తులు వారిని సోమవారం అభినందించారు.

కారును ఢీ కొన్న లారీ

కారు డ్రైవర్‌ మృతి

మరో ఇద్దరికి గాయాలు

గరుగుబిల్లి: పార్వతీపురం–పాలకొండ ప్రధాన రహదారిలో సుంకి జంక్షన్‌ వద్ద పార్వతీపురం నుంచి గుమ్మలక్ష్మీపురం వెళ్తున్న కారును ఖడ్గవలస నుంచి పార్వతీపురం వెళ్తున్న కర్రలలోడ్‌తో ఉన్న లారీ బలంగా ఢీ కొట్టడంతో జరిగిన ప్రమాదంలో కారు ముందుబాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ కుండింగి హరి ప్రసాద్‌ (29) కారులో తన సీటు, స్టీరింగ్‌ మధ్య ఇరుక్కోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే కారులో ఉన్న లవాల గౌరీశంకర్‌, బిడ్డిక శ్రీనులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ మేరకు 108కు సమాచారం అందించగా ఘటనా స్థలానికి హుటాహుటిన వచ్చి క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి చికిత్సకోసం తరలించింది. సమాచారం మేరకు ఎస్సై పి.రమేష్‌నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఇంటర్మీడియట్‌ ‘ద్వితీయ’ పరీక్షకు 372మంది గైర్హాజరు1
1/2

ఇంటర్మీడియట్‌ ‘ద్వితీయ’ పరీక్షకు 372మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్‌ ‘ద్వితీయ’ పరీక్షకు 372మంది గైర్హాజరు2
2/2

ఇంటర్మీడియట్‌ ‘ద్వితీయ’ పరీక్షకు 372మంది గైర్హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement