ఈ చిత్రం చూశారా.. ఇసుకపై పెద్ద
వాహనాలు వెళ్లినట్లు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గోపాలపురం వద్ద నాగావళి నదిలో భారీ వాహనాలతో ఇసుక తరలిపోతున్నా.. అటువంటిదేమీ లేదని, స్థానిక అవసరాలకు మాత్రమే చుట్టుపక్కల వారు తరలిస్తున్నారని అధికారులు సర్దిచెప్పుకోవడం గమనార్హం.
సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్:
క్షేత్ర స్థాయిలో నదీ తీరాల్లో జరుగుతున్న ఇసుక దోపిడీకి.. అధికారుల ప్రకటనలకు పొంతన లేకపోతోందనడానికి కొన్ని ఉదాహరణలే ఇవీ! ఆనవాళ్లు కనిపిస్తున్నా.. భారీ వాహనాల్లో ఇసుక తరలిపోతున్నా.. ‘అబ్బే ఏమీ లేదని’ అధికారుల నుంచి సమాధానాలు రావడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఎండలు మండిపోతు న్నాయి. నదీజలాలు తగ్గుముఖం పట్టాయి. ఇదే అదునుగా అక్రమార్కులు నిబంధనలకు తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా ఇసుకను వాహనాల్లో తరలించుకుపోతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క పాలకొండ నియోజకవర్గంలోనే ఇసుక వ్యాపారం రూ. కోట్లలో సాగుతోంది. ఓ వైపు కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితమంటున్నా.. అది ప్రకటనలకే పరిమితమవుతోంది. సామాన్యులకు ఇసుక బంగారంగా మారుతోంది. జిల్లాలో నాగావళి నదీతీరంలో లభిస్తున్న ఇసుక అక్రమార్కులకు అతి పెద్ద ఆర్థిక వనరుగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే మొదలు.. అధికార పార్టీ అండదండలతో ఇసుకాసురులు రెచ్చిపోవడం ప్రారంభించా రు. ఈ క్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యేపై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. పాలకొండ నియోజక వర్గ పరిధిలోని భామిని మండలంలో సింగిడి, బిల్లు మడ తదితర ప్రాంతాలతో పాటు పాలకొండ మండలం అన్నవరం, అంపిలి, గోపాలపురం గొట్ట మంగళాపురం, వీరఘట్టం పరిధిలో కొన్ని గ్రామాల ద్వారా ఇసుక అక్రమ తరలింపులు చేపట్టారు. ఈ నేపఽథ్యంలో పలుచోట్ల గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకున్నారు. పత్రికల్లో కథనాలు రావ డం.. సోషల్ మీడియా వేదికగా ఈ అక్రమ రవాణా పై పలువురు ఎండగట్టడంతో కాస్త బ్రేక్ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి సైతం ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. నదీ గర్భంలో ఇసుక సేకరణకు వినియోగిస్తున్న యంత్రాలను, పలు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.
‘రూటు’ మార్చి!
తమ ఆర్థిక వనరులకు అధికారులు అడ్డుపడటంతో అక్రమార్కులు కొత్త ఎత్తుగడ వేశారు. సచివాలయ అధికారుల ద్వారా గృహ, సొంత అవసరాలకు ఇసుక సేకరిస్తున్నట్లు ఓ అనుమతి పత్రం పొందుతున్నారు. దానిని ఆసరాగా చేసుకుని ట్రాక్టర్లతో ఇసుక దోపిడీకి తెర తీశారు. పగటి పూట మనుషు లతో వాహనాల్లోకి ఇసుక ఎత్తిస్తున్నట్లు కనిపిస్తున్నా ... రాత్రి సమయాల్లో భారీ యంత్రాల సాయంతో తరలించుకుపోతున్నారు. ఇటీవల ఇదే విషయమై అధికారులకు ఫిర్యాదులు అందాయి. పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై తనిఖీలు చేసిన జిల్లా గను లు, భూగర్భ శాఖ అధికారులు.. నాగావళి తీరంలో ఎక్కడా ఆక్రమంగా ఇసుక తరలింపులు, యంత్రా ల వాడకం జాడ లేదని, గతంలో అక్కడ ఏర్పాటు చేసిన రోడ్లు, అక్రమ ర్యాంపులు పూర్తిగా చెదిరిపోయినట్లు చెప్పుకొని రావడం గమనార్హం. సొంత అవసరాలకై నా నిబంధనల మేరకు నదీ గర్భంలో 5–6 వందల మీటర్ల దూరంలో ఇసుక సేకరించా ల్సి ఉంది. నాగావళి తీరంలో సొంత అవసరాల పేరిట అక్కడి వంతెన దిగువ భాగంలో పెద్ద ఎత్తున తవ్వుతున్నారు. రోజుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక ఎత్తుకు పోవడంపై గొట్ట మంగళాపురం గ్రామస్తులు, సీఐటీయూ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల అండతో గ్రామంలో క్షేత్ర స్థాయి అధికారులు ఈ వ్యవహారానికి కొమ్ముకాస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు అక్కడి సచివాలయంలో కొద్దిరోజుల క్రితం లిఖిత పూర్వక ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. భామిని మండలం సింగిడి వద్ద పట్టపగలే జేసీ బీ సాయంతో ఇసుక నిల్వలు చేస్తున్నారు. గోపాల పురం వద్ద నదీ గర్భంలోకి భారీ వాహనాలు తిరుగుతున్న ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నా ఇక్కడ ఏమీ జరగడం లేదని జిల్లా అధికారులే నివేదికలు ఇవ్వడం విశేషం. మరోవైపు వరదల ధాటికి తీరం వెంబడి ఇసుక మేటలు వేసినట్లు పేర్కొంటూ.. వా టిని తరలించేందుకు అధికారికంగా అనుమతులు పొంది, ఈ పేరిట యంత్రాల సాయంతో భారీగా ఇసుక తరలింపునకు రాజమార్గం సిద్ధం చేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
నాగావళి తీరం నుంచి తరలిపోతున్న ఇసుక
పేరుకే నిబంధనలు
అధికార పార్టీ అండదండలపై
తీవ్ర విమర్శలు
నాడు హడావిడి..
నేడు సహకారం!
పాలకొండ పరిధిలోని గోపాలపురం, అన్నవరం ప్రాంతాల్లో ఎటువంటి ఇసుక
తవ్వకాలుగానీ.. అక్రమ రవాణాగానీ
జరగడం లేదని జిల్లా గనులు, భూగర్భ శాఖ రాయల్టీ ఇన్‌స్పెక్టర్ షేక్ నూర్ అహ్మద్ కొద్దిరోజుల క్రితం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గోపాలపురం ప్రాంతంలోని ఇసుక రీచ్ ప్రాంతాన్ని తనిఖీ చేశామని.. ఫిర్యాదు ప్రాంతంలో ఎటువంటి వ్యక్తులు, యంత్రాలు, వాహనాలూ కనిపించలేదని పేర్కొనడం గమనార్హం.
ఫిర్యాదులు చేశాం..
మా గ్రామ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక తరలింపులపై రెండు రోజుల క్రితం సచివాలయంలో ఫిర్యాదు చేశాం. అధికారులు కొలతలు వేసి జెండాలు పాతారు. రోజు గడవక ముందే యథావిధిగా ట్రాక్టర్లపై ఇసుక తరలింపులు జరుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన వ్యక్తుల అండదండలతో ఇదంతా జరుగుతుందని లిఖిత పూర్వకంగా చెబుతున్నా స్పందన లేదు. వ్యవస్థలను భయపెట్టి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఆర్థికంగా బలపడేందుకు వంతెన దిగువన ఇసుక తవ్వి ముప్పును కొని తెచ్చుకుంటున్నారు. – మజ్జి వీరన్నాయుడు, సీఐటీయూ నాయకుడు, గొట్ట మంగళాపురం
ఇసుక అక్రమ తరలింపుతో ఖజానాకు గండి పడుతోందని ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గత ప్రభుత్వ హయాంలో గోపాలపురం వద్ద హడావిడి చేశారు. నాటి ప్రజాప్రతినిధులపై నిందలు వేశారు. ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొనే దందా సాగుతోందని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అడపాదడపా అధికారులు వాహనాలు పట్టుకుంటున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే మాత్రం ఈ అడ్డగోలు వ్యవహారం జరుగుతున్న చోటకు వచ్చిన నిజానిజాలను నిగ్గు తేల్చిన దాఖలాలు లేవు. ఇసుక అక్రమ వ్యవహారంలో అధికారుల తీరుపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
మేం చూస్తాం.. మీరు తవ్వుకోండి!
మేం చూస్తాం.. మీరు తవ్వుకోండి!
మేం చూస్తాం.. మీరు తవ్వుకోండి!