‘బంగారు కొండ’పై ఒడిశా కన్ను | - | Sakshi
Sakshi News home page

‘బంగారు కొండ’పై ఒడిశా కన్ను

Published Sat, Mar 22 2025 1:39 AM | Last Updated on Sat, Mar 22 2025 1:33 AM

సాలూరు:

ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా పల్లెల్లో ఒడిశా ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఇటీవల జల్‌జీవన్‌ మిషన్‌ పనులకు వెళ్లిన ఆంధ్రా సిబ్బందిని అడ్డుకుంది. సామగ్రిని సీజ్‌చేసి పోలీసులతో భయపెట్టింది. తాజాగా ఆంధ్రాప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేసిన ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టా భూములను లాక్కునేందుకు పూనుకుంది. గిరిజనుల పోడు సాగుకు ఆధారమైన గంజాయిభద్ర పంచాయతీ ఎగువశెంబి వద్ద ఉన్న బంగారు కొండ దురాక్రమణకు ఒడిగట్టింది. ఒడిశా అధికారులు పోలీస్‌ బలగాలతో శుక్రవారం వచ్చి భూమి పూజచేసి, కొండచుట్టూ సిమెంట్‌ పోల్స్‌ను పాతారు. దీనిని అడ్డుకున్న గిరిజనులపై దౌర్జన్యానికి దిగారు. ఇక్కడ ఏమీ చేయడానికి లేదని, ఈ భూముల్లోకి ఇకపై ఎవరూ రాకూడదని హెచ్చరికలు జారీచేశారు. ఒడిశా అధికారులు దౌర్జాన్యాన్ని వీడియోలు, ఫొటోలు తీయకుండా గిరిజనుల నుంచి సెల్‌ఫోన్లు లాక్కున్నారు. తొలి రోజు కొండచుట్టూ కొంత మేర పోల్స్‌ను పాతారు. మిగిలిన ప్రాంతంలో పాతేందుకు వీలుగా పోల్స్‌ను సిద్ధం చేశారు. పవర్‌స్టేషన్‌ నిర్మాణం కోసమని ఒడిశా అధికారులు చెబుతున్నా, ఇదంతా ఇక్కడ ఉన్న విలువైన ఖనిజ నిక్షేపాలు కొల్లగొట్టేందుకేనని గిరిజనులు ఆరోపిస్తున్నారు.

మైనింగ్‌కు సన్నాహాలు?

వివాదాస్పద కొటియా గ్రూపు గ్రామాలు ఉండే కొండల్లో విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ ప్రాంతాలను సొంతం చేసుకునేందుకు గతంలో ఒడిశా ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడగా.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఆంధ్రా అధికారులను అప్రమత్తం చేసి అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొటియా పల్లెలపై ఆంధ్రా ప్రభావం సన్నగిల్లుతోంది. దీంతో ఒడిశా అధికారుల దౌర్జన్యం పెరిగిందని స్థానిక గిరిజనులు చెబుతున్నారు.

స్పందించని మంత్రి?

వివాదాస్పద కొటియా పల్లెల్లో ఒడిశా దుందుడుకు గిరిజనులకు పోలీసులతో బెదిరింపు కొండచుట్టూ స్తంభాల ఏర్పాటు

సాగుభూములు లాక్కోవడంతో ఆందోళన

గతంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు

అందజేసిన ఆంధ్రా ప్రభుత్వం

పవర్‌ స్టేషన్‌ నిర్మాణం కోసమంటూ

బుకాయింపు...

మైనింగ్‌ తవ్వకాలకే కొండ ఆక్రమణ

అంటున్న గిరిజనం

మౌనం దాల్చిన గిరిజన సంక్షేమశాఖ మంత్రి!

కొటియా పల్లెల్లో ఒడిశా దురాక్రమణలకు పాల్పడుతున్నా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కిమ్మనకపోవడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. మంత్రి మౌనం వెనుక ఆంత్యర్యమేమిటో అర్థం కావడం లేదంటూ గిరిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రెండు చోట్ల బీజేపీ పాలిత ప్రభుత్వాలే ఉన్నాయని, సమస్యను పరిష్కరించాల్సిన పాలకు లు మిన్నకుండడాన్ని గిరిజనులు తప్పుబడుతున్నా రు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొటియా గ్రామాల అంశంపై నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒడిశా సీఎమ్‌ నవీన్‌పట్నాయక్‌తో చర్చించిన అంశాన్ని గుర్తుచేస్తున్నారు. నాడు ప్రతిపక్షంలో ఉంటూ విమర్శలు చేసిన నేటి మంత్రి గుమ్మి డి సంధ్యారాణి... ప్రత్యేక చొరవ చూపాలని, దశాబ్దాల కొటియా గ్రూప్‌ గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని గిరిజనులు కోరుతున్నారు.

‘బంగారు కొండ’పై ఒడిశా కన్ను 1
1/1

‘బంగారు కొండ’పై ఒడిశా కన్ను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement