వాట్సాప్ లింక్.. రూ.1.59 లక్షలు మాయం
● పీఎం కిసాన్ పేరిట రావడంతో ఓపెన్ చేసిన ముగ్గురు రైతులు
● బాధితులు కోనరావుపేట, మంగళ్లపల్లివాసులు
కోనరావుపేట(వేములవాడ): వాట్సాప్‌కు పీఎం కిసాన్ ఏపీకే పేరిట వచ్చిన లింక్‌ను ఓపెన్ చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నుంచి డబ్బులు మాయమయ్యాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వారి వివరాల ప్రకారం.. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల జమ వివరాలు తెలుసుకోవాలంటే ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలని కోనరావుపేటకు చెందిన ఇద్దరు, మంగళ్లపల్లికి చెందిన ఒక రైతు వాట్సాప్‌కు లింక్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగానే ముగ్గురి ఖాతాల్లో నుంచి రూ.32 వేలు, రూ.57 వేలు, రూ.70 వేల చొప్పున కట్ అయ్యాయి. దీంతో బాధితులు బుధవారం సంబంధిత బ్యాంకుకు వెళ్లి, విషయాన్ని అధికారులకు తెలిపారు. వారు పరిశీలించి, ఖాతాల్లో నుంచి డబ్బులు బదిలీ అయ్యాయన్నారు. ట్రాన్స్‌ఫర్ అయిన ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు అప్పటికే డబ్బులు తీసేసుకున్నారని, తామేమీ చేయలేమని పేర్కొన్నారు. పీఎం కిసాన్ పేరిట వాట్సాప్‌కు వస్తున్న యాప్‌ను ఓపెన్ చేయొద్దని సూచించారు.
వాట్సాప్ లింక్.. రూ.1.59 లక్షలు మాయం
Comments
Please login to add a commentAdd a comment