మాకు దిక్కెవరు కొడుకా..
వేములవాడరూరల్: నాడు కన్న కొడుకు.. నేడు దత్తత తీసుకున్న కొడుకు చనిపోయాడు.. మాకు దిక్కెవరు కొడుకా.. అంటూ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇది చూసిన స్థానికులు కంటతడి పె ట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లికి చెందిన మ్యా కల నర్సయ్య–లచ్చవ్వ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు పదేళ్ల క్రితం తేలు కుట్టి, చనిపోయాడు. దీంతో వారు వృద్ధాప్యంలో ఎవరైనా ఒకరు తోడు ఉండాలని భావించారు. నర్సయ్య చెల్లెలు చందుర్తి మండలంలోని రామారావుపల్లికి చెందిన గుడిసె సుగుణకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కు మారుడైన రమేశ్(25)ను మూడేళ్ల దత్తత తీసుకున్నారు. అతనికి రెండేళ్ల క్రితం వివాహం జరిపించారు. రమేశ్ వట్టెంల పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి పని ముగించుకొని, బైక్‌పై మరో ఇద్దరితో కలిసి ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రమేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతన వెంట ఉన్న కట్కూరి సంసాన్, గుర్రం సాయికుమార్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వేములవా డ పట్టణ సీఐ వీరప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీ లించారు. మృతుడి తల్లి సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నాడు కన్న కొడుకు..
నేడు దత్తత తీసుకున్న కొడుకు మృతి
బైక్‌ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం
కన్నీరుమున్నీరైన వృద్ధ దంపతులు
Comments
Please login to add a commentAdd a comment