నిండుకుండలా ‘ఎల్లంపల్లి’
రామగుండం: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జ లకళ సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కా గా ఆదివారం 20.175 టీఎంసీల నిల్వ ఉంద ని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. గతేడాది నవంబర్ 24వ తేదీన ప్రాజెక్టులో 17.45 టీఎంసీల నీటి నిల్వలే ఉన్నాయి. ప్ర స్తుతం 633 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అంతే మొ త్తంలో అవుట్ ఫ్లో ఉంది. ఎన్టీపీసీకి 121 క్యూ సెక్కులు, హైదరాబాద్ ప్రజల తాగునీటి అవ సరాలకు 318 క్యూసెక్కులు, రామగుండం, మంచిర్యాల మిషన్ భగీరథకు 81 క్యూసెక్కు లు విడుదల చేస్తున్నారు. జూన్ ఒకటో తేదీ(ఇరిగేషన్ ఇయర్) నుంచి ఇప్పటివరకు ప్రా జెక్టు నుంచి 329.87 టీఎంసీల నీరు గోదావ రి నది ద్వారా సముద్రంలోకి వెళ్లిందని, నంది పంపుహౌస్‌కు 23.98 టీఎంసీలు ఎత్తిపోశామని అధికారులు వివరించారు.
ఘనంగా ఎన్‌సీసీ డే
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీలో ఆదివా రం ఎన్‌సీసీ డే ఘనంగా నిర్వహించారు. ఎన్‌సీసీ కేర్ టేకర్ అధికారి శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధించిన జీడీకే–11
గోదావరిఖని: సింగరేణి సంస్థ సీఎండీ బలరాం ఆదేశాల మేరకు ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఏరియాలోని జీడీకే–11గనిలో ప్రొడక్షన్ డే నిర్వహించారు. ఈసందర్భంగా అత్యధికంగా 4వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు గని ఏజెంట్ శ్రీనివాస్, మేనేజర్ మల్లేశం తెలిపారు. అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధించిన ఉద్యోగులు, అధికారులు, కార్మికులను జీఎం అభినందించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
కమాన్‌పూర్(మంథని): మండల కేంద్రంలోని సాగి అంజలి ఇంట్లో చోరీ జరిగింది. అంజలి వారం రోజుల క్రితం వైద్యం చేయించుకోవడానికి మంచిర్యాలకు వెళ్లింది. ఆదివారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటికి వేసిన తాళం పగులగొట్టి ఉండడంతో అనుమానంతో లోనికి వెళ్లి చూసింది. దీంతో బీరువా పగులగొట్టి కనిపించింది. అందులోని సమారు 10 తులాల బంగారంతోపాటు రూ.1.50లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించింది. సమాచారం అందుకున్న ఎస్సై ప్రసాద్ వెంటనే గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం
పెద్దపల్లిరూరల్: పెద్దకల్వల గ్రామ స్టేజీ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొప్పుల హర్షవర్దన్(11) అనే బాలుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లిదండ్రులు శంకర్, శైలజతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా.. పెద్దకల్వల వద్ద రాజీవ్ రోడ్డుపై మరమ్మతు పనులు చేసే ప్రాంతంలో ఎలాంటి హెచ్చరికలు లేని కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.
నిండుకుండలా ‘ఎల్లంపల్లి’
నిండుకుండలా ‘ఎల్లంపల్లి’
Comments
Please login to add a commentAdd a comment