కష్టపడేవారికి గుర్తింపు
గోదావరిఖని: సంస్థ అభివృద్ధి కోసం కష్టించి పని చేసే ఉద్యోగులకు గుర్తింపు ఉంటుందని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) బలరాం అన్నా రు. ఆర్జీ–2 ఏరియా ఓసీపీ–3లో డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ, వెంకటేశ్వర్లుతో కలిసి గురువా రం ఆయన మాట్లాడారు. ఉద్యోగులు తమ కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించాలన్నా రు. భారీ యంత్రాల వినియోగాన్ని మరింత పెంచా లని, రక్షణతో కూడిన మెరుగైన ఉత్పత్తి లక్ష్యం సా ధించాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనలో అందరూ పాలుపంచుకోవాలని ఆయన కోరారు. అధికారులు గుప్తా, భైధ్యా, ప్రతినిధులు రాజ్‌కుమార్, మధుసూదన్, రవీందర్, నరసింహారావ్, సంతోష్‌కుమార్, ఎర్రన్న, ధనుంజయ, రాజాజీ, అనిల్‌కుమార్, రాముడు పాల్గొన్నారు.
సీఎండీకి సన్మానం
సీఎండీ బలరాంతోపాటు డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ, వెంకటేశ్వర్లును ఏఐటీయూసీ నాయకులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు ఎల్.ప్రకాశ్, రాజరత్నం, జిగురు రవీందర్, అన్నారావు శ్యాంసన్ తదితరులు ఉన్నారు.
కార్మిక కాలనీలకు మంచినీరు ఇవ్వండి
కార్మిక కాలనీలకు రోజూ మంచినీరు అందించాలని ఐఎన్‌టీయూసీ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు బదావత్ శంకర్‌నాయక్ సీఎండీకి వినతిపత్రం అందజేశారు.
ఇన్సెంటివ్ అందించాలి
బొగ్గు ఉత్పత్తిలో కీలకపాత్ర వహిస్తున్న ఓసీపీ–1 కార్మికులకు ప్రత్యేక ఇన్సెంటివ్ చెల్లించాలని ఐఎన్‌టీయూసీ నాయకులు సీఎండీకి విన్నవించారు.
సీఎండీని కలిసిన కాంగ్రెస్ నాయకులు
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సీఎండీ బలరాంను కాంగ్రెస్ నాయకులు మారెల్లి రాజిరెడ్డి, గుండేటి రాజేశ్, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్, సారయ్య నాయక్, ఆకుల రాజిరెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
ఏపీఏలో సీఎండీ పర్యటన
రామగిరి(మంథని): సీఎండీ బలరాం అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో పర్యటించారు. లాంగ్‌వాల్ పనితీరు, 3వ సీమ్ పంచ్ ఎంట్రీ పనులపై ఆరా తీ శారు. పనిస్థలాల్లో భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. అధికారులు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు ఉన్నారు.
● సింగరేణి సీఎండీ బలరాం
Comments
Please login to add a commentAdd a comment