
‘కరువుకు కేరాఫ్ కాంగ్రెస్’
గోదావరిఖని: కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా కాంగ్రెస్ నిలిచిందని రామగుండం మాజీ ఎమ్మె ల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. నీళ్లులేక ఎండిపోయిన గోదావరి నదిని బుధవా రం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల కేసీఆర్ పాలన లో గోదావరినది నిండుకుండలా ఉండేదన్నా రు. కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక వెలవెలబోతోంని అన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు గోదావరిలో స్నానం ఆ చరించడం అనవాయితీ అని, ఇప్పుడు నీరు లేక భక్తులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. నాయకులు వెంకన్న, కోడి రామకృష్ణ, ఆవునూరి వెంకటేశ్, రామరాజు ఉన్నారు.
పోలింగ్ కేంద్రాల తనిఖీ
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ బుధవా రం రాత్రి తనిఖీ చేశారు. ప్రిసైడింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. భోజన సదుపాయాలు, లైటింగ్ ఏర్పాట్లు పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా తగిన భద్ర తా ఏర్పాట్లు చేయాలని ఎస్సై వెంకటేశ్‌ను ఆదేశించారు. పెద్దపల్లి డీసీపీ చేతన, ఏసీపీ కృష్ణ, సుల్తానాబాద్, పెద్దపల్లి సీఐలు సుబ్బా రెడ్డి, ప్రవీణ్‌కుమార్, ఎస్సై వెంకటేశ్, ఏఎస్సై నీలిమ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి వైజ్ఞానిక సదస్సుకు ఎంపిక
పెద్దపల్లిరూరల్: రాష్ట్రస్థాయి వైజ్ఞానిక సదస్సుకు జి ల్లా సైన్స్ అధికారి రవినందన్‌రావు ఎంపికయ్యారని డీఈవో మాధవి తె లిపారు. కన్నాల ప్రభుత్వ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడైన రవినందన్‌రావు.. శుక్రవారం ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహించే సదస్సులో అవార్డు అందుకోనున్నారనిపేర్కొన్నారు. ‘సైన్స్ ఇన్ అవర్‌వరల్డ్’ ప్రధాన ఇతివృత్తంతో సదస్సు నిర్వహిస్తున్నారన్నా రు. విజ్ఞానశాస్త్ర విద్యలో ప్రమాణాలు పెంచేందుకు శాసీ్త్రయ మార్గాలు ఉపఅంశంలో రవినందన్‌రావు తన పరిశోధనాపత్రం సమర్పిస్తారని వివరించారు. రెండేళ్లపాటు నిర్వహించిన సంచార ప్రయోగశాల ద్వారా కృత్యాధార బోధనలోని పలు అంశాల ఆధారంగా ఈపత్రం రూపొందించారన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నత పాఠశాలల నుంచి రవినందన్‌రావు ఈ సదస్సుకు ఒక్కరే ఎంపికయ్యారని వివరించారు. డీఈవోతోపాటు సమన్వయకర్తలు పీఎం షేక్, మల్లేశ్, కవిత, కమలాకర్‌రావు ఆయనను అభినందించారు.

‘కరువుకు కేరాఫ్ కాంగ్రెస్’

‘కరువుకు కేరాఫ్ కాంగ్రెస్’
Comments
Please login to add a commentAdd a comment