సమాజ సేవ చేయాలి
జ్యోతినగర్(రామగుండం): విద్యార్థులు సమా జ సేవలో ముందుండాలని గోదావరిఖని అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు సూచించారు. ఎ న్టీపీసీ మిలీనియం హాల్‌లో సచ్‌దేవ స్కూల్ ఆ ఫ్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యా య విజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడారు. వి ద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మొబైల్ వినియోగాన్ని తగ్గించా లన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య అభ్యసించాలని తెలిపారు. ఏసీపీ రమేశ్, ఏజీపీ శంతన్‌కుమార్, ప్రతినిధులు తౌటం సతీశ్‌కుమా ర్, గుడికందుల భూమయ్య, కాదాసి శేఖర్, లోక్‌అదాలత్ సభ్యులు, ప్రిన్సిపాల్ జ్ఞాన్‌చంద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉత్తమ రైతుకు అవార్డు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కిష్టంపేటకు చెందిన కొప్పుల సత్యనారాయణకు ఉత్తమ రైతు అవార్డును డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ, కృషి విజ్ఞాన కేంద్రం, జహీరాబాద్‌లో అందజేశారు. 850 రకాల వరి వంగడాలను అభివృద్ధ్ది చేసి రై తులకు అందించినందుకు డైరెక్టర్ జనరల్ త్రి లోచన మహాపాత్ర అవార్డు అందించారు.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
జ్యోతినగర్(రామగుండం): పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌లో గ్రూప్–4 ద్వారా నియామకమైన వార్డు అధికారులు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంట్ అధికారులకు శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి కలెక్టర్ ఈ కార్యక్ర మానికి హాజరై మాట్లాడారు. తెలంగాణ ము న్సిపల్ చట్టంపై వార్డు అధికారులు, గ్రూప్–4 ఉద్యోగులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండా లని సూచించారు. పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు.
9న పద్మశాలీ మహాసభ
పాలకుర్తి(రామగుండం): హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈనెల 9వ తేదీన ని ర్వహించే 17వ అఖిల భారత పద్మశాలీ మహాసభను విజయవంతం చేయాలని పద్మశాలీ సంఘం రాష్ట్ర కన్వీనర్ దాసరి ఉష కోరారు. స్థానిక పద్మశాలీ సంఘ భవనంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మహాసభ ప్రచా ర పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఐక్యత చాటిచెప్పేందుకు చేపట్టిన మహాసభను విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్య క్రమంలో నాయకులు బూర్ల నారాయణ, కన్నం వెంకటేశ్, అరుకాల సతీశ్, చిలగాని రాజేశం, శంకర్, ఓడ్నాల రాజు, ఆడెపు లక్ష్మణ్, వీజీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
సమాజ సేవ చేయాలి
సమాజ సేవ చేయాలి
Comments
Please login to add a commentAdd a comment